అజిత్ కి విలన్ గా మారిన కార్తికేయ  

karthikeya as villain in ajith movie - Telugu Ajith Movie, Karthikeya As Villain, Kollywood, South Cinema, Tollywood

ఆర్ఎక్స్ 100 సినిమాతో టాలీవుడ్ లో ఒక్కసారిగా అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్న హీరో కార్తికేయ.అంతకుముందు ప్రేమతో మీ కార్తీక్ అనే సినిమా చేసినా కూడా ప్రేక్షకులకు అంతగా పరిచయం కానీ ఈ హీరో రెండో సినిమాతో ఒక్కసారిగా తన ఫేట్ మార్చుకున్నాడు.

Karthikeya As Villain In Ajith Movie

ఈ నేపథ్యంలో ఈ కుర్రహీరోకి టాలీవుడ్లో వరుసగా అవకాశాలు వచ్చి పడుతున్నాయి.ఇప్పటికే హీరోగా నాలుగు సినిమాలు కంప్లీట్ చేసుకున్న కార్తికేయ ప్రస్తుతం గీతా ఆర్ట్స్ బ్యానర్ లో హీరోగా ఒక సినిమాకి సైన్ చేశాడు.

ఇదిలా ఉంటే కార్తికేయ ఓవైపు హీరోగా చేస్తూనే మరోవైపు విలన్ గా కూడా తన ఇమేజ్ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాడు.

అందులో భాగంగా ఇప్పటికే నాని గ్యాంగ్ లీడర్ సినిమాలో విలన్ గా నటించి మెప్పించిన కార్తికేయకి ఇప్పుడు మరో అద్భుతమైన ఆఫర్ చేతికి చిక్కింది.

తమిళ స్టార్ హీరో అజిత్ హీరోగా శివ దర్శకత్వంలో నాలుగో సినిమా ప్రస్తుతం తెరకెక్కుతుంది.ఈ సినిమాలో ప్రతినాయక పాత్ర కోసం చాలా మందిని పరిశీలించిన డైరెక్టర్ చివరికి కార్తికేయని ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది.

అజిత్ కి తమిళ ఇండస్ట్రీలో మంచి మార్కెట్ ఉన్న కూడా తెలుగులో ఆ స్థాయిలో మైలేజ్ సొంతం చేసుకోలేక పోతున్నాడు.ఈ నేపథ్యంలో కార్తికేయ విలన్ గా తీసుకోవడం వల్ల తెలుగులో కూడా సినిమా మార్కెట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని భావించి దర్శకుడు శివ ఇతని ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది.

ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీలో ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగా త్వరలో కార్తికేయ చిత్రం కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది

#Kollywood

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Karthikeya As Villain In Ajith Movie Related Telugu News,Photos/Pics,Images..