పట్టాలెక్కనున్న కార్తికేయ సీక్వెల్  

Karthikeya 2 Plan to Going On Sets, Tollywood, Hero Nikhil, Chandoo Mondeti, 18 Pages Movies,karthikaya sequel ,chandu director ,arjun suravaram ,tollywod, anupama paramashawaran - Telugu 18 Pages Movies, Chandoo Mondeti, Hero Nikhil, Karthikeya 2, Tollywood

యంగ్ హీరో నిఖిల్ కెరియర్ లో ఎప్పటికి గుర్తుండిపోయే సినిమాగా నిలిచిపోయేది అంటే కచ్చితంగా కార్తికేయ సినిమా అని చెప్పాలి.ఫాంటసీ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమా దైవం, సైన్స్ అనే నమ్మకల చుట్టూ తిరుగుతుంది.

TeluguStop.com - Karthikeya 2 Plan To Going On Sets

ఈ సినిమాతో చందూ మొండేటి దర్శకుడుగా పరిచయం అయ్యాడు.నిఖిల్ కి ఈ సినిమాతో కెరియర్ లో బ్లాక్ బస్టర్ హిట్ వచ్చింది.

దీని తర్వాత అతని కెరియర్ ట్రాక్ కూడా పూర్తిగా మారింది.గతంలో కమర్షియల్, హీరోయిజం అంటూ వెళ్ళిన నిఖిల్ ఈ సినిమా తర్వాత కంటెంట్ బేస్ కథలకి ప్రాధాన్యత ఇస్తూ తనకంటూ ప్రత్యేకమైన మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు.

TeluguStop.com - పట్టాలెక్కనున్న కార్తికేయ సీక్వెల్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

నిఖిల్ సినిమా అంటే అందులో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది అనే బ్రాండ్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు.

చివరిగా అర్జున్ సురవరంతో హిట్ కొట్టిన నిఖిల్ ప్రస్తుతం సుకుమార్ రైటింగ్స్, గీతా ఆర్ట్స్ 2 సంయుక్తంగా నిర్మిస్తున్న 18 రోజెస్ సినిమాలో నటిస్తున్నాడు.

ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతంది.సూర్య ప్రతాప్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది.రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది.ఇదిలా ఉంటే కార్తికేయకి సీక్వెల్ ని కూడా చందూ మొండేటి, నిఖిల్ గత ఏడాది అఫీషియల్ ఎనౌన్స్ చేసి ఓపెనింగ్ కూడా చేసేశారు.

అలాగే కాన్సెప్ట్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు.ఈ సీక్వెల్ ని ఏకంగా 25 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించడానికి ప్లాన్ చేశారు.

అయితే చందూ మధ్యలో ఈ సీక్వెల్ పక్కన పెట్టి నివేతా పేతురాజ్ తో లేడీ ఒరియాంటెడ్ సినిమా చేసుకున్నాడు.అయితే నిర్మాతలకి, దర్శకుడుకి మధ్య బడ్జెట్ విషయంలో సమన్వయం కుదరడంతో ఇప్పుడు సెట్స్ పైకి తీసుకెళ్ళడానికి రెడీ అవుతున్నట్లు టాక్ వినిపిస్తుంది.

#Chandoo Mondeti #Karthikeya 2 #18 Pages Movies #Hero Nikhil

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు