అప్పటినుండి షూటింగ్ స్టార్ట్ అంటున్న కార్తికేయ 2 చిత్ర బృందం...!

యంగ్ హీరో నిఖిల్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు.మొదటి సినిమా హ్యాపీడేస్ తోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో ఇతడు.

 Hero Nikhil Karthikeya2 Movie Shooting Starts Soon, Nikhil, Tollywood, Lockdown,-TeluguStop.com

నిఖిల్ మినహా ఆ సినిమాలో నటించిన ఇంకెవ్వరు అంతగా క్లిక్ అవ్వలేదు.హ్యూమర్ తో కూడిన నిఖిల్ యాక్టింగ్ అంటే యూత్ కి బాగా ఇష్టం.

అందుకే అతడు తెలుగు సినిమా పరిశ్రమలో మన్నగలిగాడు.తనకంటూ ఓ ప్రత్యేకమైన మార్కెట్ సృష్టించుకోగలిగాడు.

అయితే నిఖిల్ తరువాత సోలో హీరోగా చాలా సినిమాల్లో నటించినప్పటికీ కార్తికేయ, స్వామి రారా వంటి సినిమాలు నిఖిల్ స్థానాన్ని టాలీవుడ్ సుస్థిరం చేశాయని చెప్పాలి.ఆ తర్వాత కిరాక్ పార్టీలో నటించి మెప్పించిన నిఖిల్ ఇప్పుడు ‘కార్తికేయ’ సూపర్ హిట్ కు సీక్వెల్ ‘కార్తికేయ-2’లో నటిస్తున్నాడు.

ప్రస్తుతం కరోనా కారణంగా వాయిదా పడ్డ ఈ సినిమా షూటింగ్ త్వరలో స్టార్ట్ కాబోతోంది.కరోనా నియమాలను పాటిస్తూ షూటింగ్ జరుపుకోవచ్చు అని ప్రభుత్వం అనుమతి ఇవ్వగానే సదరు సినిమా టీమ్ షూటింగ్ షురూ చేసారు.

వచ్చే నెల 26 నుండి ఈ చిత్ర బృందం షూటింగ్ ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.ఈ సినిమా కూడా ఫస్ట్ పార్ట్ మాదిరి మంచి థ్రిల్లింగ్ గా ఉండబోతుందని టాలీవుడ్ లో గుసగుసలు వినపడుతున్నాయి.

ఇకపోతే ఈ సినిమా అనంతరం.నిఖిల్ ’18 పేజీస్‌’ అనే సినిమాలో నటించబోతున్నాడు.

ఈ సినిమా తరువాత శ్రీ వేంకటేశ్వర సినిమాస్ LLP (ఏషియన్ గ్రూప్ యూనిట్‌) బ్యానర్‌పై మరో సినిమా అనౌన్స్ చేసేసాడు.కాగా దీనికి టైటిల్ ను ఇంకా నిర్ణయించలేదు.

కాగా నిఖిల్ ఇటీవలే ఓ ఇంటివాడైన సంగతి అందరికీ విదితమే.అయినప్పటికీ నిఖిల్ విరామం తీసుకోకుండా వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube