కార్తీక పౌర్ణమి విశేషాలు ఇవే..!

సంవత్సరంలో ఎంతో పవిత్రమైన మాసాలలో కార్తీక మాసం ఒకటి.ఈ కార్తీక మాసంలో ప్రతి రోజూ ఒక వేడుకగా నిర్వహిస్తారు.

 Karthika Pournami Specility In Telugu-TeluguStop.com

ఈ నెలంతా దీపాల వెలుగులో, భక్తిశ్రద్ధలతో ఆ శివకేశవులకు ప్రతి రోజు ప్రత్యేక పూజలు జరిపిస్తారు.ఈ నెలలో వచ్చే కార్తీక శుద్ధ పౌర్ణమి, కార్తీక మాసంలో శుక్లపక్షంలో పున్నమికి కలిగిన ఈ 15వ రోజును కార్తీక పౌర్ణమి గా జరుపుకుంటారు.

ఈరోజు ఎంతో పవిత్రమైనదిగా భావించి ప్రత్యేక పూజలలో పాల్గొంటారు.ఈరోజు శివాలయంలో శివునికి రుద్రాభిషేకం, దీపారాధన చేయడం వల్ల ముక్కోటి దేవుళ్ళ ఆశీర్వాదం కలుగుతుంది.

 Karthika Pournami Specility In Telugu-కార్తీక పౌర్ణమి విశేషాలు ఇవే..-Devotional-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమిని హిందువులు ఒక పర్వదినంగా జరుపుకుంటారు.పురాణాల ప్రకారం ప్రజలను పట్టి పీడిస్తున్న తిరకాసురుడు అనే రాక్షసున్ని కార్తికేయుడు పౌర్ణమి రోజున సంహరించడం వల్ల సంతోషంలో ప్రజలు దీపాలను వెలిగించి ఒక వేడుకగా జరుపుకుంటారు.

అందువల్ల కార్తీక పౌర్ణమిని త్రిపుర పూర్ణిమ లేదా దేవ దీపావళి అని కూడా పిలుస్తారు.అంతేకాకుండా ఈరోజు వెయ్యేళ్ల రాక్షసుల పాలన అంతమైన సందర్భంలో ఆ పరమ శివుడు తాండవం చేసాడని మన పురాణాలు చెబుతున్నాయి.

అందువల్ల ఈ కార్తీక పౌర్ణమి అటు శివుడికి, విష్ణువు కు ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు.

ఈ కార్తీక పౌర్ణమి రోజు మహిళలు ఉదయం నుంచి ఉపవాస దీక్షలలో పాల్గొని సంధ్యా సమయంలో అవు నెయ్యితో దీపం వెలిగించి నదులలో, లేదా కాలువలో దీపాలను వదిలి ఆ నదీ జలాలకు పసుపు, కుంకుమలు సమర్పించి పూజించడం ద్వారా మంచి ఫలితాలు కలుగుతాయి.

అంతేకాకుండా ఆ రోజు సాయంత్రం చంద్రుని దర్శనం తర్వాత ఉపవాస దీక్షలను విరమించాలి.అలాగే ఈ కార్తీక పౌర్ణమి రోజు బియ్యపు పిండితో చేసిన దీపాలను, లేదా ఉసిరి దీపాలను శివాలయాలలో వెలిగించడం ద్వారా సకల పాపాలు తొలగిపోతాయి.

ఇంతటి పవిత్రమైన రోజున దీప దానం, సాలగ్రామ దానం, వంటి దానధర్మాలు చేయడం వల్ల శుభపరిణామాలు ఏర్పడతాయని ప్రగాఢ విశ్వాసం.ఇంతటి పవిత్రమైన రోజున శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము చేసుకోవడం చాలా శ్రేష్టం.

#Amla Lamps #Karthika Masam #Lord Shiva

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

DEVOTIONAL