కార్తీక పౌర్ణమి రోజు 365 ఒత్తులు ఎందుకు వెలిగిస్తారో తెలుసా?

కార్తీక మాసాన్ని ఎంతో పరమపవిత్రమైన మాసంగా భావిస్తారు.ఈ కార్తీకమాసం అంటే ఆ శివకేశవులకు ఎంతో ప్రీతికరమైన నెల.

 Karthika Masam,karthika Deepam,365 Wicks Pooja,karthika Pournami, 365 Wicks Pooj-TeluguStop.com

ఈ నెలంతా దేవాలయాలలో మొత్తం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంటుంది.కార్తీకమాసంలో శివాలయాలలో ప్రత్యేక పూజలను నిర్వహించి శివనామస్మరణతో మారుమోగుతుంటాయి.

ఈ నెల మొత్తం పూజలు, హోమాలు, వ్రతాలు, ఉపవాసాలు శుభకార్యాలకు ఎంతో ప్రసిద్ధి చెందినది.

ఈ నెలలో వచ్చే పౌర్ణమి ఎంతో పవిత్రమైన పౌర్ణమి గా భావిస్తారు.

కార్తీక పౌర్ణమి రోజు ఉదయం స్నానమాచరించి పెద్ద ఎత్తున భక్తులు దేవాలయాలను సందర్శించి దీపాలను వెలిగిస్తూ ఉంటారు.అయితే కార్తీక పౌర్ణమి రోజు రోజంతా ఉపవాసం ఉండి సంధ్యా సమయంలో 365 వత్తులను వెలిగించడం ద్వారా ఎంతో పుణ్య ఫలం దక్కుతుంది.

సంవత్సరంలో 365 రోజులు ఉంటాయి కాబట్టి, కార్తీక పౌర్ణమి రోజు 365 వత్తులను ఆవు నెయ్యి వేసి వెలిగించడం ద్వారా సంవత్సరం మొత్తం దీపారాధన చేసినంత పుణ్యఫలం దక్కుతుంది.

అయితే కార్తీక పౌర్ణమి రోజు దీపాలను కొందరు శివాలయంలో వెలిగిస్తారు.

ఆ అవకాశం లేనివారు తులసికోట ముందు ఈ దీపాలను వెలిగించిన పుణ్య ఫలం దక్కుతుంది.అంతేకాకుండా కార్తీక పౌర్ణమి రోజు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి.

కార్తీక పౌర్ణమి రోజు శివాలయాలలో దీపారాధన చేయడం వల్ల ముక్కోటి దేవతల ఆశీర్వాదాలు మనకు దక్కుతాయి.శివాలయాలలో సహస్ర లింగార్చన, మహాలింగార్చన లు చేసినవారికి సర్వ శుభాలు కలుగుతాయని మన పురాణాలు తెలియజేస్తున్నాయి.

స్త్రీలు కార్తీక పౌర్ణమి రోజు ఉపవాసంతో సాయంత్రం దీపాలను ఆవు నెయ్యి తో వెలిగించి నదిలో వదిలి, ఒకరికొకరు తాంబూలాలను ఇచ్చిపుచ్చుకుంటారు.తరువాత చంద్ర దర్శనం చేసుకొని ఉపవాస దీక్ష విరమించుకుంటారు.

ఇలా చేయడం ద్వారా దీర్ఘ సుమంగళీ ప్రాప్తి కలుగుతుందని ప్రగాఢ విశ్వాసం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube