కార్తీకంలో శివకేశవులను ఆరాధిస్తే వచ్చే ఫలితాలు  

Karthika Masam Special Puja-

చాంద్రమానాన్ని అనుసరించి వచ్చే ఎనిమిదవ మాసం కార్తీక మాసం.ఈ మాసంను వెన్నెల మాసం అని కూడా పిలుస్తారు.పన్నెండు మాసాలలో కార్తీక మాసానికి ప్రత్యేకమైన స్థానం ఉంది.ఈ మాసానికి ఉన్న ఒక ప్రత్యేకత ఏమిటంటే ఈ మాసం శివకేశవులు ఇద్దరికీ చాలా ప్రీతికరమైనది.

ఈ మాసంలో దేవాలయాల దర్శనం, దేవతారాధన,నదీ స్నానం,ఉపవాసం,కార్తీక దీపారాధన,పురాణ పఠనం,వనభోజనం ముఖ్యమైనవి.

Karthika Masam Special Puja- Telugu Devotional Bhakthi(తెలుగు భక్తి ) Karthika Masam Special Puja---

కార్తీక మాసంలో ఉదయాన్నే అంటే సూర్యోదయానికి ముందే లేచి తలస్నానము చేయాలి.

ఈ మాసంలో శివుణ్ణి జిల్లేడు పూలతోను,మారేడు దళాలతోను పూజ చేయాలి.శ్రీ మహా విష్ణువును తులసి దళాలతోను,జాజిపూలతోను పూజ చేయాలి.

కార్తీక మాసంలో పగలంతా ఉపవాసం ఉండి రాత్రి చంద్రుడు వచ్చాక భోజనం చేస్తే మంచిది.

నెల రోజుల పాటు ఉపవాసం చేయలేని వారు కార్తీక మాసంలో ఉన్న పర్వదినాల్లో ఉపవాసం చేసిన విశేషమైన ఫలితం దక్కుతుంది.

కార్తీక మాసంలో సోమవారాలు,ఏకాదశి,పౌర్ణమి,మాస శివరాత్రి వంటి పర్వ దినాలు ఉన్నాయి.ఈ మాసం అంతా ఇంటిలో దీపాలు వెలిగించటం వలన సమస్త పాపాలు, దోషాలు నశించి, అనంతమైన పుణ్యఫలాలు లభిస్తాయని మన పెద్దవారు చెప్పుతూ ఉంటారు.

Karthika Masam Special Puja- Telugu Devotional Bhakthi(తెలుగు భక్తి ) Karthika Masam Special Puja-- Telugu Related Details Posts....

DEVOTIONAL