కార్తీక మాసం మొత్తం పూజలు చేయకపోయినా… ఆ రోజు ఇలా తప్పకుండా చేయాలి.!

Karthika Masam Rituals That Blend Your Life

కార్తీకమాసం ఇది ఒక రోజు పండుగ కాదు.నెల రోజుల పండుగ.

 Karthika Masam Rituals That Blend Your Life-TeluguStop.com

కార్తీక మాసమంతా తెల్లవారక ముందే పరగడపున లేచి కృత్తికా నక్షత్రము అస్తమించేలో గానే నదులలో గాని తటాకాలలో గాని అలాంటివి అందుబాటులో లేనప్పుడు ఇంట్లోని స్నానాల గదిలో తప్పక తలస్నానమాచరించాలి.అప్పుడే అది కార్తీక స్నానం అవుతుంది.

9 వ తారీఖున సోదరి ఇంట భోజనం చేయాలి.

 Karthika Masam Rituals That Blend Your Life-కార్తీక మాసం మొత్తం పూజలు చేయకపోయినా… ఆ రోజు ఇలా తప్పకుండా చేయాలి.-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కార్తీక మాసంలో మొదటిగా వచ్చేది యమ విదియ.

దీనినే భగినీ హస్త భోజనం.అన్నా చెల్లెళ్ల పండుగ అని కూడా అంటారు.

ఈ పండుగ నవంబరు 9వ తేదీన వస్తోంది.యమధర్మరాజు సోదరి యమనా దేవి ఒక రోజు అలక చెందగా ఆయన ఆమెకు ఒక వరం ఇస్తారు.

యమ విదియ రోజున ఎవరు తన సోదరి ఇంట భోజనం చేస్తారో వారికి నరక బాధలు ఉండవని చెబుతారు.అందుకే ఈ రోజున సోదరి ఇంట భోజనం చేసి ఆశీర్వచనాలు అందిస్తారు.

ఈ సాంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది.

Telugu Ekadashi, Karthika Masam, Karthikamasam, Rituals-Telugu Bhakthi

11వ తేదిన నాగుల చవితి…

మహిళలు ఎంతో భక్తిశ్రద్ధలతో చేసుకునే పండుగ నాగుల చవితి.రోజున పుట్టలో పాలు పోసుకుని నాగేంద్రుడికి పూజలు చేస్తారు.సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలకు వెళ్లి ప్రార్థిస్తారు.

పూర్వం తక్షకుడు చేపట్టిన సర్పయాగం వల్ల యాగంలో పడి పాములు చనిపోతాయి.సర్పరాజు తపస్సు చేసి ఇంద్రుడుని ప్రార్థిస్తాడు.

ఆయన ఆ యాగాన్ని ఆపించడం వల్ల సర్పజాతికి విముక్తి కలుగుంది.అందుకే ఆ రోజున భక్తులు ఆనందంగా పుట్టలో పాలు పోసి వారికి సమర్పిస్తారు.

ఏకాదశి ఉపవాసాలు:

రోజున ఉపవాసాలు ఉంటారు.మహావిష్ణువు క్షీర సముద్రంలో శయన ఏకాదశి నుంచి యోగ నిద్రలో ఉండి కార్తీక ఏకాదశి రోజున తిరిగిలేస్తారు.

అందుకే ఉపవాసాలు ఉండి మరుసటి రోజున బ్రాహ్మ ణులకు స్వయం పాకం ఇచ్చి భోజనం చేస్తారు.

క్షీరాబ్ది ద్వాదశి:

సాయంత్రం ఇంటిలోని తులసి మొక్క దగ్గర ధాత్రి (ఉసిరి మొక్క)ను ఉంచి విష్ణుమూర్తికి పూజలు చేస్తారు.12,16,21 దీపాలను వెలిగించి మహిళలు పూజలు చేసుకుంటారు.వీటినే ద్వాదశ దీపాలు అంటారు.

రోజున ప్రతీ ఇంటా ఈ దీపాల వెలుగులతో నిండిపోతుంది.

కార్తీక పౌర్ణమి:

కృత్తిక నక్షత్రంతో వచ్చే పౌర్ణమిని కార్తీక పౌర్ణమి అంటారు.రోజున ఉపవాసం ఉంటే శివరాత్రి రోజున ఉపవాసం ఉంటే ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితం ఉంటుందని పండితులు చెబుతున్నారు.ఉదయం నుంచి ఉపవాసం ఉండి, కార్తీక దామోదరున్ని పూజించి 365 ఒత్తులు వెలిగించి చం ద్రుని దర్శనమైన తరువాత ఉపవాస దీక్షను విరమిస్తారు.

అంతే కాకుండా కొత్తగా పెళ్లయిన అమ్మాయితో 33 పున్నమి నోములు చేయిస్తారు.ఆ రోజు సాయంత్రం శివాలయంలో అమ్మవారికి గుమ్మడిపండు, కంద, పసుపు మొక్కతో పాటు స్వయం పాకం ఇప్పిస్తారు.

Telugu Ekadashi, Karthika Masam, Karthikamasam, Rituals-Telugu Bhakthi

పోలి స్వర్గం కార్తీక మాసం:

ఆఖరి రోజు వచ్చే అమావాస్య వెళ్లిన మరుసటిరోజున పోలిస్వర్గం పూజలు చేస్తారు.దీనికి సంబంధించిన కథను పురోహితుల ద్వా రా విని వారికి స్వయంపాకాలు ఇచ్చి అరటి డిప్పలో దీపాలు పెట్టి కాల్వలో గానీ, చెరువులోగానీ వదులు తారు.దాంతోకార్తీక మాసం దీక్షలు పరిసమాప్తి అవుతాయి.కార్తీక మాసం మొత్తం పూజలు చేయకపోయినా.ఈ ఒక్క రోజు చేస్తే కార్తీక మాసం మొత్తం చేసే పూజల పుణ్యం లభిస్తుంది అని భక్తుల నమ్మకం.

#KarthikaMasam #Karthika Moon #Ekadashi #Rituals #Karthika Masam

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube