అనాధ ఆశ్రమంలో వంటలక్కకు పాలాభిషేకం.. వైరల్ అవుతున్న వీడియో!

కార్తీకదీపం అనే పేరు వినగానే అందరికీ టక్కున వంటలక్క గుర్తుకొస్తుంది.ఇందులో ప్రేమి విశ్వనాథ్ దీప పాత్రలో నటించినప్పటికీ ఆమెకు దీప అనే పేరు కన్నా వంటలక్క అనే పేరు ఎంతో గుర్తింపు తీసుకువచ్చింది.

 Karthika Deepam Vantalakka Premi Viswanath Birthday Celebration, Vantalakka Birt-TeluguStop.com

నిజానికి ప్రేమి విశ్వనాథ్ కేరళకు చెందిన అమ్మాయి అయినప్పటికీ విశేషమైన తెలుగు ప్రేక్షకాదరణ దక్కించుకుంది.ఇక బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ అద్భుతమైన రేటింగ్స్ తో దూసుకుపోతోంది.

ఈ సీరియల్ ను బీట్ చేసే సీరియల్ లేదా కార్యక్రమం ఇప్పటివరకు ఏమీ రాలేదనే చెప్పాలి.

ఇలా బుల్లితెర పై ఎంతో ప్రేక్షకాదరణ దక్కించుకొని దూసుకుపోతున్న కార్తీకదీపం సీరియల్ లో దీప పాత్రలో నటిస్తున్నటువంటి ప్రేమి విశ్వనాథ్​కు విశేషమైన ఆదరణ దక్కింది.

రెండు తెలుగు రాష్ట్రాలలో వంటలక్కకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు.ఇందులో ఈమె నటనకు గాను ప్రేక్షకుల నుంచి 100 కు 100 శాతం మార్కులు పడ్డాయి.

ఇదిలా ఉండగా ఈమె పై ఉన్న అభిమానం ఎక్కడి వరకు దారితీసింది అనే విషయానికి వస్తే.ఏకంగా ఈమె ఫొటోలకు పాలాభిషేకాలు నిర్వహించే స్థాయిలో ఈమె ప్రేక్షకాదరణ దక్కించుకుందని చెప్పవచ్చు.

డిసెంబర్ 2వ తేదీ వంటలక్క పుట్టినరోజు కావడంతో ఈమెకు స్టార్ మా ప్రత్యేక వీడియోను రూపొందించి జన్మదిన శుభాకాంక్షలను తెలియజేసింది.ఇక ఈ వీడియోను ప్రేమి విశ్వనాథ్ తన ఫేస్ బుక్ ద్వారా షేర్ చేస్తూ స్టార్ మాకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఇక ఈ విషయం తెలియడంతో పెద్దఎత్తున అభిమానులు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.ఇలా కొందరు హ్యాపీ బర్త్డే దీపక్క.

అంటూ శుభాకాంక్షలు తెలపగా మరికొందరు హ్యాపీ బర్త్డే వంటలక్క అంటూ పెద్ద ఎత్తున అభిమానులు ఈమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

ఇక ఈమె పుట్టిన రోజు సందర్భంగా ఈమె అభిమానులు శుభాకాంక్షలు తెలియచేయడమే కాకుండా అనాధాశ్రమంలో కేక్ కట్ చేయించి అక్కడ పిల్లలకు పండ్లు పంపిణీ చేశారు.

అలాగే మరి కొందరు ఈమె ఫొటోకు పాలాభిషేకాలు నిర్వహించారు.సాధారణంగా సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోల పుట్టిన రోజులకు అభిమానులు ఇలా చేయడం మనం చూస్తూ ఉంటాం కానీ బుల్లితెర నటీనటుల కోసం అభిమానులు ఈ విధంగా కేక్ కట్ చేస్తూ పాలాభిషేకాలు చేయడం కేవలం ఒక వంటలక్క విషయంలో మాత్రమే జరిగిందని చెప్పాలి.

Telugu Karthika Deepam, Karthikadeepam, Premi Viswanath, Vantalakka-Movie

ఈ విధంగా అభిమానులు తనపై ప్రేమను చూపించడంతో ప్రేమి విశ్వనాథ్ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఇక ప్రస్తుతం ఈ సీరియల్ ఎంతో రసవత్తరంగా కొనసాగుతోంది.మోనిత ఎత్తులకు దీప పైఎత్తులు వేస్తూ ఆమె ప్లాన్స్ అన్ని చిత్తు చేస్తూ కార్తీక్ తప్పు లేదని నిరూపించింది.ఇక ఇప్పటి వరకు టాప్ రేటింగ్ లో దూసుకుపోతున్న ఈ సీరియల్ కు పోటీగా గత కొద్దిరోజుల నుంచి గుప్పెడంత మనసు, ఇంటింటి గృహలక్ష్మి సీరియల్స్​ వస్తున్నాయని చెప్పవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube