దారుణంగా పడిపోయిన కార్తీకదీపం టీఆర్పీ.. కారణం?

బుల్లితెరపై మంచి క్రేజ్ లో ఉన్న సీరియల్ కార్తీకదీపం.ఈ సీరియల్ ప్రారంభం నుండి మంచి రేటింగ్ తో దూసుకుపోతుంది.

 Karthika Deepam Trp Ratings Fall, Karthika Deepam, Trp Ratings, Deepa, Doctor Ba-TeluguStop.com

అంతేకాకుండా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సొంతం చేసుకుంది టీవీ సీరియల్.సామాన్యులే కాకుండా సెలబ్రిటీలు కూడా ఈ సీరియల్ కు బాగా అలవాటు పడ్డారు.

ఇక ఈ సీరియల్ సమయానికంటే ముందే హాట్ స్టార్ లో వీక్షిస్తున్నారు అభిమానులు.ఇప్పటివరకు ఓ రేంజ్ లో రేటింగ్ ను సంపాదించుకున్న ఈ సీరియల్ ప్రస్తుతం రేటింగ్ విషయంలో దారుణంగా పడిపోయింది.

నిజానికి ఈ సీరియల్ కథ విడిపోయిన భార్య భర్తలను కలిసే నేపథ్యంలో సాగుతుంది.ఇక ఈ సీరియల్ మొదట్లో విడిపోయిన కార్తీక్, దీప లు ఎప్పుడు కలుస్తారానని అభిమానులు ఎదురుచూడని రోజులే లేవు.

అలా ఎన్నో ట్విస్ట్ లతో సాగిన ఈ సీరియల్.కొన్ని రోజుల కిందట కార్తీక్, దీప లు కలుసుకున్నారు.ఇక కలుసుకునే సమయంలో ఉన్నట్టుండి రేటింగ్ బాగా పెరిగిపోయింది.అంతేకాకుండా హాట్ స్టార్ లో కూడా వీక్షించే అభిమానులు ఎక్కువయ్యారు.

అలా అంత హై రేంజ్ లో రేటింగ్ పెంచుకున్న ఈ సీరియల్ మళ్లీ చాలావరకు దిగజారింది.కారణమేంటో అందరికీ తెలిసిందే.కలవక కలవక ఎన్నో ఏళ్లుగా ట్విస్ట్ లు ఎదుర్కొని కలుసుకున్న కార్తీక్, దీప లు మరుక్షణమే మళ్లీ విడిపోయారు. మోనిత వచ్చి కార్తీక్ వల్ల ప్రెగ్నెంట్ అని చెప్పడంతో ఈ సీరియల్ ఇక శుభం కార్డు పలకదని అంతేకాకుండా కార్తీక్, దీపలు కలవడం ఇప్పట్లో సాధ్యం కాదని తేల్చి చెప్పేస్తున్నారు అభిమానులు.

దీంతో అభిమానులు కూడా కథను సాగదీస్తున్నారని చూడటమే వదిలేసారు.ఇక ఈ నేపథ్యంలో రేటింగ్ కూడా బాగా దిగజారింది.

Telugu Deepa, Babu, Karthika Deepam, Trp-Movie

25వ వారం లో ఈ సీరియల్ బ్రేక్ పడగా 24వ వారం నుంచి వచ్చేసరికి అర్బన్ లో 17.28 రేటింగ్, రూరల్ లో 17.67 రేటింగ్ వచ్చింది.ప్రస్తుతం 25వ వారంలో అర్బన్ లో 16.99, రూరల్ లో 16.20 రేటింగ్ వచ్చింది.దీంతో గత వారం కంటే ఈ వారం రేటింగ్ మరింత తగ్గింది.ఇక కథను ఇలాగే సాగదీస్తే మొత్తానికి రేటింగ్ లేకుండా పోతుందని అర్థమవుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube