ఐపీఎల్ టైంలో కూడా ఏ మాత్రం క్రేజ్ తగ్గని వంటలక్క సీరియల్  

Karthika Deepam star maa Telugu serial created a national record, Tollywood, Television Serials, Star Maa, Karthika Deepam, TRP Rating - Telugu Karthika Deepam, Karthika Deepam Star Maa Telugu Serial Created A National Record, Star Maa, Television Serials, Tollywood, Trp Rating

స్టార్ మాలో అత్యంత ప్రజాధారణ పొందిన సీరియల్ గా కార్తీక దీపం సీరియల్ రన్ అవుతుంది.ఒక్కరోజు కూడా ఏ మాత్రం రేటింగ్ తగ్గకుండా ఈ సీరియల్ని తెలుగు ప్రేక్షకులు చూస్తున్నారు అంటే దానితో ఎంతగా కనెక్ట్ అయ్యారో అర్ధం చేసుకోవచ్చు.

TeluguStop.com - Karthika Deepam Star Maa Telugu Serial Created A National Record

ఈ మధ్య కాలంలో కేవలం తెలుగులోనే కాకుండా ఏ బాషలో కూడా సీరియల్స్ కి రానంత హైయెస్ట్ రేటింగ్ కార్తీక దీపం సీరియల్ కి వస్తుంది.సూపర్ హిట్ సినిమా ప్రీమియర్ కి కూడా ఈ సీరియల్ కి వస్తున్న స్థాయిలో రేటింగ్ రాకపోవడం విశేషం.

ఇక ఈ సీరియల్ లో వంటలక్క పాత్రకి చాలా మంది కనెక్ట్ అయిపోయారు.సోషల్ మీడియాలో ఆ పాత్ర మీద వస్తున్న మీమ్స్ చూస్తూ ఉంటే సీరియల్ కి ఎంతగా ఎడిక్ట్ అయ్యారో చెప్పొచ్చు.

TeluguStop.com - ఐపీఎల్ టైంలో కూడా ఏ మాత్రం క్రేజ్ తగ్గని వంటలక్క సీరియల్-General-Telugu-Telugu Tollywood Photo Image

తాజాగా స్టార్ మా కూడా ఈ సీరియల్ దేశంలోనే అత్యధిక రేటింగ్ వస్తున్న సీరియల్ గా ప్రకటించుకుంది.

ఇదిలా ఉంటే దేశంలో ఐపీఎల్ వీక్షించే వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది.

అయితే ఈ సారి ఐపీఎల్ మ్యాచ్ లు కూడా కార్తీక దీపం సీరియల్ ప్రసారం అయ్యే సమయం అయినా 7:30 కి స్టార్ట్ కావడంతో ఐపీఎల్ ప్రభావం సీరియల్ పై పడుతుందని భావించారు.అయితే ఐపీఎల్ కార్తీక దీపం సీరియల్ మీద ఏ మాత్రం ప్రభావం చూపడం లేదు.ఐపీఎల్ సీజన్ టైంలో కూడా ఈ సీరియల్ 20.7 పైన రేటింగ్ తెచ్చుకుంటూ దూసుకుపోతుంది.క్రికెట్ ప్రేమికులు దేశ వ్యాప్తంగా ఉన్న, తెలుగు రాష్ట్రాలలో కార్తీక దీపం సీరియల్ వచ్చే సమయంలో ఇంట్లో ఆడవాళ్ల ఇష్టాన్ని దాటుకొని ఐపీఎల్ మ్యాచ్ లు చూసే పరిస్థితి లేదని దీనిని బట్టి అర్ధం చేసుకోవచ్చు.అయితే మగవాళ్ళు కూడా ఈ సీరియల్ కి ఎడిక్ట్ అయ్యారని రేటింగ్స్ చెబుతుంది.రోజుకి ఈ సీరియల్ ని 4.2 కోట్ల మంది చూస్తున్నారని స్టార్ మా యాజమాన్యం అఫీషియల్ గా ప్రకటించింది.

#Star Maa #TRP Rating #Karthika Deepam #KarthikaDeepam

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Karthika Deepam Star Maa Telugu Serial Created A National Record Related Telugu News,Photos/Pics,Images..