వయసేమో చిన్న, చేసే పనులు మాత్రం మిన్న... ‘కార్తీకదీపం’ శౌర్యకు సన్మానం...!

తెలుగు ప్రేక్షకులకు కార్తీకదీపం సీరియల్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.తెలుగు టెలివిజన్ లో అత్యధికంగా రేటింగ్ పొందిన సీరియల్ గా కార్తీక దీపం రికార్డులను సృష్టించింది.

 Child Artist Baby Krithika Helping Oldage Home, Donations, Karthika Deepam Shour-TeluguStop.com

కార్తీకదీపం సీరియల్ గురించి తెలియని తెలుగు వాడు ఉండకపోవచ్చు బహుశా.కార్తీకదీపం సీరియల్ తెలుగు సీరియల్ అభిమానులు నెత్తిన పెట్టుకున్నారు.

ఇక ఈ సీరియల్ లో భాగంగా డాక్టర్ బాబుగా నిరుపమ్ నటిస్తుండగా, దీప పాత్రలో ప్రేమ విశ్వనాథ్ నటిస్తుంది.వీరిద్దరితో పాటు రౌడీగా అల్లరి అల్లరి చేస్తూ అందరినీ నిలదీసే క్యారెక్టర్ చేస్తున్న శౌర్య.

ఈ అమ్మాయి కేవలం సీరియల్ లో మాత్రమే ఫేమస్ కాదు… సోషల్ మీడియాలో కూడా బాగా పాపులర్ పొందిన అమ్మాయి.

బుల్లితెరపై అమ్మాయి తెచ్చుకున్న క్రేజ్ ను ఉపయోగించుకుని సినిమాల్లో కూడా నటించే అవకాశాన్ని పొందింది.

ఇకపోతే కార్తీక దీపం ద్వారా వచ్చిన ఫెమ్ తో సోషల్ మీడియా ద్వారా శౌర్య కొన్ని మంచి పనులు చేస్తూ ఉంటుంది.అంతేకాదు అందరికీ వీలైనంతవరకు మంచి పనులు చేయమని వీలైనంత సహాయం చేస్తుందని చెబుతూ అందరికీ స్ఫూర్తిగా నిలుస్తూ ఉంటుంది.

ఇకపోతే, ఈ మధ్యకాలంలో కార్తీకదీపం సీరియల్ అభిమాని ఆ అమ్మాయిని తన భార్యను పుట్టినరోజు సందర్భంగా విష్ చేయమని అడగగా దానికి శౌర్య మీరు ముందు ఎవరికైనా సహాయం చేయండి అప్పుడు నేను చెబుతాను అంటూ ఓ చిన్న కండిషన్ పెట్టింది.

దీంతో ఆ అభిమాని తనకు తోచినంత పరిధిలో కొంతమందికి నిత్యావసర సరుకులను అందజేశాడు.

ఇందుకు సంబంధించిన వివరాలను ఆ అమ్మాయికి పంపగా అది చూసిన శౌర్య అభిమానికి తన భార్యకు విషెస్ చెబుతున్న వీడియోని పంపించింది.ఇక ఈ విషయం అలా పెడితే శౌర్య ప్రతి నెల ఆశ్రమానికి కచ్చితంగా విరాళం అందజేస్తుందట.

అంతే కాదు అందులో ఎవరికైనా ఆర్థిక సహాయం కావాలన్నా కూడా కొంత మొత్తంలో వారిని ఆదుకుంటుంది.ఏది ఏమైనా ఇంత చిన్న వయసులో అంత పెద్ద మనసు ఉన్న శౌర్యని ఆశ్రమం లోని సభ్యులంతా కలిసి సన్మానం చేశారు.

ఈ విషయాన్ని తాజాగా శౌర్య తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube