వంటలక్క వల్ల బాధ పడుతున్న ఫ్యాన్స్.. ఏమైందంటే..?

బుల్లితెర పాపులర్ సీరియల్స్ లో ఒకటైన కార్తీకదీపంకు ప్రేక్షకాదరణ అంతకంతకూ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదనే సంగతి తెలిసిందే.ఈ సీరియల్ లో వంటలక్క పాత్రలో ప్రేమీ విశ్వనాథ్ నటిస్తూ తన నటనతో లక్షల సంఖ్యలో అభిమానులను సొంతం చేసుకున్నారు.

 Karthika Deepam Serial Premi Viswanath Vantalakka Stay Away From Social Media Fans Unhappy , Karthika Deepam, Vantalakka, Social Media Fans, Unhappy, Premi Viswanath, Deglamorous, Real Life, Lady Oriented Movies, Vantalakka Fans-TeluguStop.com

స్టార్ హీరోయిన్ స్థాయిలో తెలుగులో వంటలక్క పాపులారిటీని సంపాదించుకోవడం గమనార్హం.ఈమె కోసమే చాలామంది కార్తీకదీపం సీరియల్ ను చూస్తున్నారు.

ప్రేమీ విశ్వనాథ్ తెలుగమ్మాయి కాకపోయినా తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని పొందారు.అయితే వంటలక్క చేసిన ఒక పని వల్ల ఆమె ఫ్యాన్స్ బాధ పడుతున్నారని తెలుస్తోంది.ప్రేమీ విశ్వనాథ్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారనే సంగతి తెలిసిందే.అయితే గత కొన్ని రోజుల నుంచి వంటలక్క సోషల్ మీడియాలో యాక్టివ్ గా లేరు.

 Karthika Deepam Serial Premi Viswanath Vantalakka Stay Away From Social Media Fans Unhappy , Karthika Deepam, Vantalakka, Social Media Fans, Unhappy, Premi Viswanath, Deglamorous, Real Life, Lady Oriented Movies, Vantalakka Fans-వంటలక్క వల్ల బాధ పడుతున్న ఫ్యాన్స్.. ఏమైందంటే..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

వంటలక్క సోషల్ మీడియాలో యాక్టివ్ గా లేకపోవడానికి కారణం తెలియాల్సి ఉంది.

గతంలో ప్రేమీ విశ్వనాథ్ కార్తీకదీపం సీరియల్ కు సంబంధించిన కీలక విషయాలను, ఫోటోషూట్ లను అభిమానులతో వంటలక్క పంచుకునేవారు.సీరియల్ లో డీగ్లామరస్ గా కనిపించే ప్రేమీ విశ్వనాథ్ రియల్ లైఫ్ లో మాత్రం అందంగా కనిపిస్తారు.ప్రస్తుతం వంటలక్క ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమాలో నటిస్తుండగా ఈ సినిమాతో ఆమె సినిమాల్లో కూడా సక్సెస్ సాధిస్తారేమో చూడాల్సి ఉంది.

సినిమాల్లో సక్సెస్ సాధిస్తే మాత్రం ప్రేమీ విశ్వనాథ్ సీరియళ్లకు దూరమయ్యే అవకాశం ఉంది.ప్రస్తుతం ప్రేమీ విశ్వనాథ్ తెలుగులో కార్తీకదీపం మినహా మరే సీరియల్ లో నటించడం లేదు.

సీరియల్ కు రేటింగ్స్ బాగానే ఉన్నా కథ, కథనం బోరింగ్ గా ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ ఏడాది చివరినాటికి కార్తీకదీపం సీరియల్ ముగుస్తుందని తెలుస్తోంది.ప్రస్తుతం ఈ సీరియల్ టీఆర్పీ రేటింగ్ 15 కంటే ఎక్కువగా ఉండటం గమనార్హం.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube