వంటలక్క అత్త 'కెరీర్' ప్రారంభంలో ఎలాంటి పని చేసిందో తెలిస్తే..?

కార్తీకదీపం సీరియల్ వంటలక్క అత్త పాత్రలో సౌందర్య ఎంతో అద్భుతంగా నటించి ఎంతో మంది హృదయాలను దోచుకున్నారు.బుల్లితెర తెలుగు సీరియల్స్ లో కార్తీకదీపం సీరియల్ కు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

 Karthika Deepam Serial Actress Archana About Her Carrier-TeluguStop.com

ఈ సీరియల్ లో ప్రతి పాత్ర ప్రేక్షకుల మదిని దోచే చేసింది.ఈ సీరియల్ లో సౌందర్యగా నటించిన అర్చన కేవలం మనకు వంటలక్క అత్తగా మాత్రమే తెలుసు.

ఈ పాత్రలో తాను ఎంతో ఒదిగిపోయి నటించిన సౌందర్య తన తర్వాత తెలుగు సీరియల్ ”కేరాఫ్ అనసూయ”గా మరోసారి మన తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు.అయితే సౌందర్య గురించి మరి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

సాధారణంగా మనం సెలబ్రిటీస్ ను మీరు జీవితంలో ఏం కావాలనుకున్నారు అని అడిగితే, ఎక్కువ మంది నుంచి మనం వినే సమాధానం డాక్టర్ కావాలనుకున్నాను కానీ… యాక్టర్ అయ్యాను అనే సమాధానాన్ని వింటారు.కానీ సౌందర్య మాత్రం అందుకు భిన్నంగా యాక్టర్ కాకపోయి ఉంటే ఫ్యాషన్ డిజైనర్ అయ్యేదని చెప్పారు.

తన జీవితంలో ఫ్యాషన్ డిజైనర్ గా తన కెరీర్ మొదలు పెట్టినప్పుడు, తన సహచరులు ఓ కన్నడ ప్రాజెక్ట్ కోసం ఆడిషన్ ఇవ్వమని కోరగా అందుకు సరేనని ఒప్పుకున్న అర్చన ఆడిషన్ లో పాల్గొన్నారు.ఈ విధంగా ఒక షార్ట్ ఫిలిం ద్వారా తన ప్రస్థానం మొదలుపెట్టిన అర్చన కన్నడ, మలయాళం, తమిళ సీరియల్స్ లో బాగానే పేరు సంపాదించుకున్నారు.

తన నటనా రంగంలోకి వచ్చిన దాదాపు పది సంవత్సరాలకు తెలుగు బుల్లితెరపై నటించే అవకాశం లభించింది.

తెలుగులో కార్తీకదీపం సీరియల్ లో అవకాశం రావడంతో తెలుగు బుల్లితెరపై నటించారు.

ఈ సీరియల్ లో సౌందర్య పాత్ర రావడం ఎంతో అదృష్టం అని భావించారు.ఈ సీరియల్ ద్వారా తన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న అర్చన తన తర్వాత తెలుగు సీరియల్ లో మధ్యాహ్నం రెండు గంటలకు స్టార్ మా లో ప్రసారమయ్యే కేరాఫ్ అనసూయ లో ఒక పేదింటి అమ్మాయిగా నటించి మరోసారి ప్రేక్షకుల ఆకట్టుకున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube