ఉద్యోగ ప్రకటన జారీ చేసిన వంటలక్క.. స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్న నిరుద్యోగులు!

బుల్లితెర కార్తీకదీపం సీరియల్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వంటలక్క ప్రస్తుతం కార్తీకదీపం సీరియల్ కు దూరమయ్యారు.ఇలా కార్తీకదీపం సీరియల్ నుంచి తప్పకుండా ప్రేమి విశ్వనాథ్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటిస్తూ అభిమానులను సందడి చేస్తున్నారు.

 Karthika Deepam Premi Vishwanath Job Vacancies Post Viral On Social Media Detail-TeluguStop.com

ఇలా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండి అభిమానులతో ముచ్చటించే వంటలక్క తాజాగా నిరుద్యోగ అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలను కల్పిస్తూ ఒక పోస్ట్ చేశారు.ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ విధంగా వంటలక్క ఉద్యోగ ప్రకటన జారీ చేయడంతో ఎంతో మంది నిరుద్యోగులు ఈ ఉద్యోగాలు చేయడానికి ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారు.ఇంతకీ వంటలక్క జారీ చేసిన ఉద్యోగ ప్రకటనలో ఎలాంటి ఉద్యోగాలు ఉన్నాయనే విషయానికి వస్తే… డ్రైవర్ అకౌంటెంట్ ఉద్యోగాల కోసం అభ్యర్థులు కావాలి అంటూ ఈమె తన ఉద్యోగ ప్రకటనలో వెల్లడించారు.

డ్రైవర్ ఉద్యోగానికి అర్హత డ్రైవింగ్ వచ్చి ఉంటే చాలని ఫోర్ వీలర్ డ్రైవర్ కావాలని వెల్లడించారు.

ఇక అకౌంటెంట్ ఉద్యోగం విషయానికి వస్తే ట్యాలీ తప్పనిసరిగా వచ్చి ఉండాలని, ఈ ఉద్యోగం చేయడానికి రెండు సంవత్సరాలపాటు అనుభవం ఉండాలని ఆమె పేర్కొన్నారు.అయితే ఈ ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులు కొచ్చిలోని ఎర్నాకులంలో ఉద్యోగం చేయాల్సి ఉంటుందని ఈమె పేర్కొన్నారు.ఇలా ప్రేమి విశ్వనాథ్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతో మంది నెటిజన్లు ఈ ఉద్యోగం చేయడానికి ఆసక్తి కనబరచడం విశేషం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube