డ్యాన్స్ తో ఇరగడిసిన కార్తీకదీపం సౌందర్య.. అందరూ ఫిదా!

స్టార్ మా లో ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రస్తుతం ఎంత జోరులో ఉందో అందరికి తెలిసిన సంగతే.ఈ సీరియల్ ప్రస్తుతం ఓ రేంజ్ లో దూసుకుపోతుంది.

 Karthika Deepam Gang All Set To Have Blast On Start Music Show Archana Ananth Ma-TeluguStop.com

ఇందులో నటించే నటీనటులు, వాళ్ళ పాత్రలు ప్రేక్షకఅభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.ఇక ఈ సీరియల్ లో వంటలక్క, డాక్టర్ బాబు ల పాత్ర ప్రతి ఒక్కరి హృదయాలని తాకాయి.

అంతేకాకుండా ఈ సీరియల్ లో అమ్మ, అత్తమ్మ పాత్రలో లీనమైన సౌందర్య గురించి ఎంత చెప్పినా తక్కువే.

కార్తీకదీపం సీరియల్ లో డాక్టర్ బాబు అమ్మగా, వంటలక్క అత్తగా నటిస్తున్న సౌందర్య.

అసలు పేరు అర్చన అనంత్.ఆమె ఈ సీరియల్ లో తన అందంతో, తన పాత్రతో, భావోద్వేగాలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.

అంతేకాకుండా ఆమె తయారయ్యే విధానం ప్రతి ఒక్క ఆడపడుచులను ఆకట్టుకుంటుంది.ఇదిలా ఉంటే ఆమె వయసు కేవలం 32 సంవత్సరాలు మాత్రమే.

సీరియల్ లో ఆమె వయసు 50కి పైబడిన తరుణంలో చూపించగా.నిజానికి ఆమె యంగ్ గా కనిపిస్తుంది.

తాజాగా సుమ అందిస్తున్న స్టార్ మ్యూజిక్ షో లో కార్తీకదీపం టీం పాల్గొన్నారు.ఈ కార్యక్రమం కు సంబంధించిన ప్రోమో విడుదల కాగా అందులో సౌందర్య అత్త తన అందంతో అందరినీ ఆకర్షించింది.

అంతేకాకుండా తన కొడుకు డాక్టర్ బాబు తో కలిసి మాస్ స్టెప్పు చేయగా.అందరూ ఆశ్చర్యపోయారు.ఇది చూసిన సుమ ” డాక్టర్ బాబు.మీ అమ్మగారు ఇంత మంచి డాన్సర్ అని ఇప్పటి వరకు నాకు తెలియదు బాబు అంటూ.

మీ ఇద్దరిలో ఉన్న డిఫరెంట్ యాంగిల్ బయట పడుతున్నాయి” అని సుమ కౌంటర్ వేసింది.దీంతో వెంటనే డాక్టర్ బాబు లోపల ఒరిజినల్ అలాగే ఉందని తన అమ్మ వైపు చూపించగా.

యంగ్ అత్త తెగ సిగ్గు పడింది.ప్రస్తుతం ఈ ప్రోమో తెగ వైరల్ గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube