దేవుడా.. వంటలక్క కూతురు ఏంటి ఇంత అల్లరి చేస్తుంది!

స్టార్ మా లో ప్రసారం అవుతున్న వంటలక్క సీరియల్ అదే ”కార్తీక దీపం” గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.లాక్ డౌన్ ముందు వరకు వావ్ అనిపించేలా ఉన్న ఈ సీరియల్ లాక్ డౌన్ తర్వాత ఏంటి రా బాబు ఇది అనేలా తయారయ్యింది.

 Vantalakka, Karthika Deepam, Hima, Dance Video-TeluguStop.com

ఒకటే పాయింట్ తో.లాగదీస్తు ఆ సీరియల్ ని పిచ్చి సీరియల్ లా తయారు చేశారు.ఏదో వంటలక్కకు అభిమానులు ఉన్నారు కాబట్టి ఆ సీరియల్ కు టీఆర్పీ వస్తుంది కానీ లేకపోతే ఆ సీరియల్ ఎప్పుడో ముగిసిపోయేది.

ఇకపోతే ఈ సీరియల్ లో వంటలక్క కూతుర్లు ఇద్దరు.

వారిలో ఒకరు సౌర్య, మరొకరు హిమ.ఇద్దరు మంచి నటులే.

సౌర్య క్యారెక్టర్ హైప్ చేశారు కాబట్టి కాస్త ఎక్కువ ఫెమ్ సంపాదించింది హిమ కూడా ఆ రేంజ్ లో ఫెమ్ సాధించింది.అయితే ఈ పిల్ల కార్తీకదీపం సీరియల్ వంటలక్కలా నల్లగా కనిపించిన రియాలిటీగా చాలా అందంగా తెల్లగా ఉంటుంది.

హిమ కేవలం ఈ ఒక్క సీరియల్ లోనే కాదు మౌనరాగం సీరియల్ లో అమ్ములు చిన్నప్పటి క్యారెక్టర్ లో నటించింది.

అంతకముందు జీ తెలుగులో ప్రసారం అయిన డ్రామా జూనియర్స్ లో కూడా పార్టిసిపేట్ చేసింది.

జీ తెలుగులో ప్రసారం అయిన అమ్మనా కోడలా సీరియల్ లో కూడా హిమ నటించింది.ఇక ఈ నేపథ్యంలోనే ఇటీవల హిమ ఓ వీడియోను ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది.

ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది.ఆ వీడియోలో హిమ గ్యాంగ్ లీడర్ సినిమాలో హొయినా హొయినా అనే సాంగ్ కి డ్యాన్స్ చేసింది.

ఆ వీడియో చూసిన నెటిజన్లు అంత వావ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.మరికొందరు కామెంట్స్ చేస్తూ ”వామ్మో.

వంటలక్క కూతురు ఏంది ఇట్లా డ్యాన్స్ చేస్తుంది” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.మరి మీరు ఓసారి ఈ వీడియో చూసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube