కార్తీక దీపం సీరియల్ అభిమానికి టీవీ కానుకగా పంపించిన దీప  

karthika deepam fame premi viswanath send gift to her fan, IPL, Indian Premier League, Star Maa, Karthika Deepam, Premi Viswanath - Telugu Indian Premier League, Ipl, Karthika Deepam, Karthika Deepam Fame Premi Viswanath Send Gift To Her Fan, Premi Viswanath, Star Maa

తెలుగు రాష్ట్రాలలో స్టార్ మాలో ప్రసారం అయ్యే కార్తీక దీపం సీరియల్ ఎంత పాపులర్ అయ్యిందో అందరికి తెలిసిందే.ప్రస్తుతం అన్ని చానల్స్ లో వస్తున్న సీరియల్స్ లో నెంబర్ వన్ స్థానంలో టాప్ రేటింగ్ తో ఈ సీరియల్ దూసుకుపోతుంది.

TeluguStop.com - Karthika Deepam Fame Premi Viswanath Send Gift To Her Fan

ఎంటర్టైన్మెంట్ రియాలిటీ షోలు కూడా కార్తీక దీపం రేటింగ్ కి బ్రేక్ చేయలేకపోతున్నాయి.ఇక ప్రస్తుతం ప్రసారం అవుతున్న బిగ్ బాస్ సీజన్ 4 కూడా కార్తీక దీపం సీరియల్ రేటింగ్ కి క్రాస్ చేయలేకపోతుంది.

ఇదిలా ఉంటే కార్తీక దీపం సీరియల్ ప్రసారం అయ్యే సమయం అయిన 7:30 నిముషాలకె ఐపీఎల్ మ్యాచ్ లు లైవ్ ప్రసారం మొదలవుతుంది.అయితే ఈ విషయం మీద కార్తీక దీపం సీరియల్ అభిమాని ఒకరు ఐపీఎల్ టైమింగ్ మార్చాలని ట్విట్టర్ లో గంగూలీని ట్యాగ్ చేసి పోస్ట్ పెట్టాడు.

TeluguStop.com - కార్తీక దీపం సీరియల్ అభిమానికి టీవీ కానుకగా పంపించిన దీప-General-Telugu-Telugu Tollywood Photo Image

ఇందులో స్టార్ మాని కూడా ట్యాగ్ చేశాడు.

ఇక సూర్యాపేటకి చెందిన ఆ సీరియల్ అభిమాని పోస్ట్ పై స్టార్ మా కూడా రియాక్ట్ అయ్యి ఇది న్యాయమైన కోరిక అని ట్వీట్ చేసింది.

అయితే ఈ పోస్ట్ వ్యవహారం కార్తీకదీపంలో హీరోయిన్‌ దీప పాత్ర పోషిస్తున్న ప్రేమి విశ్వనాథ్‌కు తెలిసింది.ఒక సీరియల్‌ను ఇంతలా అభిమానించేవారు ఉంటారా అని ఆశ్చర్యం వ్యక్తం చేసింది.

అయితే ఐపీఎల్‌ టైమింగ్‌ మార్చడం కుదరని పని అని తెలుసుకున్న ప్రేమి విశ్వనాథ్‌ వారి అభిమానానికి సంతోషించి తానే స్వయంగా ఉత్తరంతో పాటు 32 అంగుళాల టీవీని కొని ఆ అభిమాని‌ ఇంటికి పంపించింది.ఇప్పుడు అతని‌ ఇంట్లో ఏ సమస్య లేదు.

మొత్తానికి ఒక్క ట్విట్టర్ అభ్యర్ధనతో ఏకంగా కార్తీక దీపం హీరోయిన్ ప్రేమి విశ్వనాథ్ మనస్సు గెలుచుకొని ఆమె నుంచి టీవీని కానుకగా పొందిన ఆ అభిమానికి సంబందించిన వార్త స్థానికంగా వైరల్ అయ్యింది.

#KarthikaDeepam #Star Maa #IndianPremier #Premi Viswanath #Karthika Deepam

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Karthika Deepam Fame Premi Viswanath Send Gift To Her Fan Related Telugu News,Photos/Pics,Images..