లేడీ ఓరియెంటెడ్ స్టోరీతో సినిమా ఎంట్రీ ఇస్తున్న వంటలక్క  

Karthika Deepam Fame Premi Viswanath Plan To Enter Movies, Tollywood, Star MAA, Telugu Serials, Telugu Cinema - Telugu Karthika Deepam, Karthika Deepam Fame Premi Viswanath Plan To Enter Movies, Movies, Premi Viswanath, Star Maa, Telugu Cinema, Telugu Serials, Tollywood

తెలుగు టెలివిజన్ లో కార్తీక దీపం సీరియల్ ద్వారా వంటలక్క దీప పాత్రలో ప్రతి ఇంటికి చేరువ అయిన సీరియల్ హీరోయిన్ ప్రేమ్ విశ్వనాధ్.రెండు తెలుగు రాష్ట్రాలలో కార్తికా దీపం చూడనివారంటూ ఉండరు.

TeluguStop.com - Karthika Deepam Fame Premi Viswanath Plan To Enter Movie

అలాగే వంటలక్క కష్టాలు గురించి చర్చించుకొని ఆడవాళ్లు ఉండరు.ఓవిధంగా చెప్పాలంటే ఈ సీరియల్ ప్రభావం కేవలం ఆడవాళ్ళ మీదనే కాకుండా మగవాళ్ల మీద కూడా ఉంది.

సీరియల్ లో కార్తిక్, దీప పాత్రలకి టెలివిజన్ ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయిపోయారు.సినిమా హీరోయిన్లుకి లేని ఫ్యాన్ ఫాలోయింగ్ ఈ సీరియల్ లో నటిస్తున్న ప్రేమ్ విశ్వనాథ్ కి ఉంది.

TeluguStop.com - లేడీ ఓరియెంటెడ్ స్టోరీతో సినిమా ఎంట్రీ ఇస్తున్న వంటలక్క-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఇదిలా ఇప్పుడు వంటలక్క త్వరలో సినిమా ఎంట్రీ ఇవ్వబోతుంది అని తెలుస్తుంది.

ఆమె లీడ్ రోల్ లో ఓ లేడీ ఒరియాంటెడ్ సినిమాని తెరకెక్కించేందుకు రంగం సిద్ధం అయ్యిందని సమాచారం.

ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ సినిమాని నిర్మించబోతోంది.మహిళల సమస్యలని ఈ సినిమాలో ప్రధానంగా చర్చించనున్నట్లు టాక్ నడుస్తుంది. ఓ యంగ్ దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో ఆమె సినిమా చేయడానికి అంగీకరించినట్లు సమాచారం.ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి ప్రీప్రొడక్షన్ వర్క్ జరుగుతుందని.

త్వరలో ఈ సినిమా గురించి అఫీషియల్ ఎనౌన్సమెంట్ ఉంటుందని సమాచారం.వంటలక్క పాత్రలో టెలివిజన్ ప్రేక్షకులకి చేరువ అయిన ప్రేమ్ విశ్వనాథ్ ఇప్పటికే మలయాళంలో కూడా సీరియల్స్ చేశారు.

అయితే సినిమాలుమాత్రం ఇప్పటి వరకు చేయలేదు.తెలుగులో ఆమెకి ఉన్న క్రేజ్ నేపధ్యంలో లేడీ ఒరియాంటెడ్ కథాంశంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది.

#Movies #KarthikaDeepam #Star Maa #Karthika Deepam #Premi Viswanath

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Karthika Deepam Fame Premi Viswanath Plan To Enter Movie Related Telugu News,Photos/Pics,Images..