డాక్టర్ బాబు ఇంటిని చూశారా.. ఇంద్ర భవనంను తలపిస్తోందిగా?

బుల్లితెరపై అత్యధిక రేటింగ్స్ తో దూసుకుపోతున్న కార్తీకదీపం సీరియల్ ఫేమ్ పరిటాల నిరుపమ్ అలియాస్ కార్తీక్ అలియాస్ డాక్టర్ బాబుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న డాక్టర్ బాబు సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు.కార్తీక్ చంద్రముఖి సీరియల్ ద్వారా నటి మంజులతో కలిసి నటించడంతో వీరి మధ్య ప్రేమ చిగురించి పెళ్లికి దారి తీసిన సంగతి మనకు తెలిసిందే.

 Karthika Deepam Fame Nirupam Paritala Wife Manjula Nirupam Home Tour-TeluguStop.com

సోషల్ మీడియాలో మంజుల కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు.ఇకపోతే అందరూ సెలబ్రిటీలు మాదిరిగానే వీరిద్దరూ మంజుల నిరూపమ్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి వీడియోలను యూట్యూబ్ ఛానల్ ద్వారా అప్లోడ్ చేస్తూ అభిమానులకు మరింత దగ్గరవుతున్నారు.

తాజాగా మంజుల నిరుపమ్ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా వారి హోమ్ టూర్ చేయడంతో అత్యధిక వ్యూస్ సంపాదించుకుంది.ఇక ఈ వీడియోలో డాక్టర్ బాబు ఇల్లు చూస్తే అచ్చం ఇంద్ర భవనాని తలపిస్తుందని చెప్పవచ్చు.

 Karthika Deepam Fame Nirupam Paritala Wife Manjula Nirupam Home Tour-డాక్టర్ బాబు ఇంటిని చూశారా.. ఇంద్ర భవనంను తలపిస్తోందిగా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అద్భుతమైన ఇంటీరియర్ డిజైన్స్ చూస్తే అచ్చం ఇంద్రభవనంలా అనిపిస్తుంది.ఇందులో మంజుల నిరుపమ్ వారికి వచ్చిన అవార్డులను చూపిస్తూ అప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.

అలాగే లివింగ్ రూమ్ లో గోడకు వినాయకుడి ఫోటోను ఎంతో ప్రత్యేకంగా డిజైన్ చేయించామని వినాయకుడి గురించి వివరించారు.

అదేవిధంగా తన కొడుకు రిక్కీకి పెయింటింగ్, ఆర్ట్ అంటే ఎంతో ఇష్టమని.తన కొడుకు వేసినటువంటి కొన్ని పెయింటింగ్స్ కూడా ఈ వీడియోలో చూపించారు.ఇక మంజుల తన సామ్రాజ్యమైన కిచెన్ గురించి అని వివరిస్తూ తెలియజేశారు.

అదేవిధంగా తన కొడుకు వారికి వేసిన టువంటి పెయింటింగ్స్ చూపించడమే కాకుండా తన కొడుకు బెడ్ రూమ్ కూడా ఈ వీడియోలో చూపించారు.అలాగే బాల్కనీలో తన పెంచుకుంటున్న మొక్కలను చూపించారు.

నిజంగా డాక్టర్ బాబు హోమ్ టు చూస్తే ఇంత అద్భుతంగా ఉందా తన ఇల్లు అని ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోవాల్సిందే.మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా డాక్టర్ బాబు హోమ్ టూర్ వీడియోని చూసి తన ఇల్లు ఎలా ఉందో చెప్పేయండి.

#Karthika Deepam #Manjula Nirupam #Manjula #Nirupam #Babu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు