ఇన్నాళ్లకు గ్రీన్ ఇండియా తీసుకున్న డాక్టర్ బాబు.. ఫోటోలు వైరల్!

బుల్లితెర శోభన్ బాబుగా బుల్లితెరపై ఎంతో మంచి ప్రేక్షకాదరణ దక్కించుకున్న కార్తీకదీపం సీరియల్ హీరో డాక్టర్ బాబు (పరిటాల నిరుపమ్) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.కార్తీకదీపం సీరియల్ ద్వారా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న డాక్టర్ బాబు తాజాగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్నారు.

 Karthika Deepam Doctor Babu Nirupam Participates In Green India Challenge ,kart-TeluguStop.com

ఈ క్రమంలోనే ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి జిహెచ్ఎంసి పార్కులో డాక్టర్ బాబు మొక్కలను నాటారు.

Telugu Ghmc Park, Greenchallange, Greenindia, Karthika Deepam, Mpjoginipally-Mov

ఈ క్రమంలోనే ఈ చాలెంజ్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఈ సందర్భంగా డాక్టర్ బాబు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకొని ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని అతని పై ప్రశంసలు కురిపించారు.అదే విధంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనకు మొక్కలు ఎంతో అవసరమని ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మొక్కలు నాటి వాటిని పరిరక్షించాలని పరిటాల తెలియజేశారు.

Telugu Ghmc Park, Greenchallange, Greenindia, Karthika Deepam, Mpjoginipally-Mov

ఇక తనవంతుగా ఈరోజు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో మొక్కలు నాటానని తెలిపిన డాక్టర్ బాబు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఇతర సీరియల్ నటులు అనుదీప్ చౌదరి, ప్రీతమ్, మానస ఈ ముగ్గురికి డాక్టర్ బాబు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసిరారు.ప్రస్తుతం డాక్టర్ బాబుకు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ప్రస్తుతం ఈయన కార్తీకదీపం, హిట్లర్ సీరియల్స్ ద్వారా బిజీగా ఉండటమే కాకుండా మరో వైపు తన భార్యతో కలిసి యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్న విషయం మనకు తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube