అతుకుల చొక్కలో డాక్టర్ బాబు..అసలు విషయం ఏమిటంటే?

బుల్లితెరలో కార్తీకదీపం సీరియల్ తో ఎంతోమంది అభిమానుల హృదయాలను గెలుచుకున్న నటుడు డాక్టర్ బాబు అలియాస్ నిరుపమ్ పరిటాల.ఇక ఈయన బుల్లితెర లో ఎన్నో సీరియల్స్ లో నటించి బుల్లితెర శోభన్ బాబు గా పేరు తెచ్చుకున్నాడు.

 Karthika Deepam Doctor Babu New Shirt Look Goes Viral On Internet  Karthika Deep-TeluguStop.com

కానీ కార్తీకదీపం సీరియల్ మాత్రం తన కెరీర్ నే మార్చేసింది.ఈ సీరియల్ లో తన నటనకు మంచి గుర్తింపు రావడంతో మరిన్ని బుల్లితెర అవకాశాలు కూడా వచ్చాయి.

కార్తీకదీపం సీరియల్ తో పాటు జీ తెలుగులో ప్రసారం అవుతున్న హిట్లర్ గారి పెళ్ళాం సీరియల్ లో కూడా హీరోగా నటిస్తున్నాడు నిరుపమ్.ఇక ఈ సీరియల్ తో కూడా మంచి క్రేజ్ ని సంపాదించుకున్నాడు.

ఇదిలా ఉంటే ఈయనకు వెండితెరపై కూడా పలు సినిమాలలో అవకాశాలు కూడా వచ్చాయి.కానీ డేట్స్ కుదరకపోవడంతో అవకాశాలన్ని వదులుకున్నాడు.

ఇక సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటాడు.

Telugu Docter Babu, Karthika Deepam, Newlook, Serial-Movie

అభిమానులతో బాగా ముచ్చట్లు పెడుతుంటాడు.కార్తీకదీపం సీరియల్ పట్ల ఆయనపై ఎదురయ్యే ట్రోలింగ్స్ కి బాగా స్పందిస్తూ ఉంటాడు.అంతేకాకుండా కొన్ని విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటాడు.

ఇక ఆయన సంబంధించిన ఫోటోలను బాగా షేర్ చేస్తూ ఉంటాడు.తాజాగా తన ఇన్ స్టా గ్రామ్ వేదికగా ఓ ఫోటో షేర్ చేయగా ప్రస్తుతం అది వైరల్ గా మారింది.

అందులో అతుకుల చొక్కా వేసుకొని పైగా సీరియస్ లుక్ తో కనిపించాడు.ఇక దీనికి ఓ పోస్టు కూడా చేశాడు డాక్టర్ బాబు.

Telugu Docter Babu, Karthika Deepam, Newlook, Serial-Movie

స్మైల్ చేయొచ్చు కదా అని చెప్పకండి.ఫోటో తీసినోడు వద్దన్నాడు.ఎందుకంటే ఆటిట్యూడ్ అన్నాడు.ఈసారికి ఇలా కానివ్వండి.అంటూ పైగా తన అతుకుల షర్ట్ నచ్చితే దాని క్రెడిట్ @dhruboutikque కి ఇవ్వమని తెలిపాడు.అంతేకాకుండా మీరు కూడా ట్రై చేయొచ్చు అని కామెంట్ చేశాడు.

ప్రస్తుతం ఈ అతుకుల షర్టు వేసుకున్న డాక్టర్ బాబు ఫోటో నెట్టింట్లో వైరల్ గా మారగా ఈ లుక్ ని చూసిన డాక్టర్ బాబు అభిమానులు ఫిదా అవుతున్నారు.మన డాక్టర్ బాబు ఎలా ఉన్నా అందంగా ఉంటాడు అని తెగ కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube