కార్తీకదీపం క్లైమాక్స్.. అందరూ సర్ప్రైజ్ అవ్వడం ఖాయమంటున్న డాక్టర్ బాబు!- Karthika Deepam Climax Will Be Surprise All People

karthika deepam climax...all will be surprised says doctor babu, doctor babu, vantalakka, nirupam paritala, premi viswanath, karthika deepam - Telugu Doctor Babu, Karthika Deepam, Nirupam Paritala, Premi Viswanath, Vantalakka

స్టార్ మా లో ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ గురించి తెలుగు ప్రేక్షకుల్లో తెలియని వారెవరు లేరు.ఇక ఈ సీరియల్ కు ఉన్న క్రేజ్ అంతో ఇంతో కాదు.

 Karthika Deepam Climax Will Be Surprise All People-TeluguStop.com

స్టార్ మా లో ఎక్కువ రేటింగ్ ఈ సీరియల్ నుండే వస్తుంది.ఇందులో నటించే నటుల పాత్రలు.

ముఖ్యంగా వంటలక్క, డాక్టర్ బాబు ల గురించి తెలుగు రాష్ట్రాల్లో మాట్లాడకుండా ఉండరు.వీళ్లిద్దరు ఎప్పుడు కలుస్తారా అన్నట్లు ఎదురు చూస్తూ టీవీల ముందల వాలిపోతారు.

 Karthika Deepam Climax Will Be Surprise All People-కార్తీకదీపం క్లైమాక్స్.. అందరూ సర్ప్రైజ్ అవ్వడం ఖాయమంటున్న డాక్టర్ బాబు-Gossips-Telugu Tollywood Photo Image-TeluguStop.com

డాక్టర్ బాబు గా నిరుపమ్ పరిటాల, వంటలక్క గా ప్రేమి విశ్వనాథ్ లు ఈ సీరియల్ లో ప్రధానపాత్రధారులుగా నటిస్తున్నారు.ఈ సీరియల్ మొదటినుంచి రేటింగ్ విషయంలో ముందుంది.

ఇదిలా ఉంటే వీళ్ళ బిడ్డలుగా సౌర్య, హిమా ల పాత్రలు మరింత ఆకట్టుకుంటాయి.ఇటీవలే నటుడు నిరుపమ్ యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇవ్వగా అందులో కొన్ని విషయాలను తెలిపారు.

నిరుపమ్ ను తన వ్యక్తిగత విషయాలు తెలుపగా ప్రస్తుతం తన ఫేమ్ లో ఉన్న కార్తీకదీపం సీరియల్ గురించి కొన్ని ప్రశ్నలు అడిగారు.దీంతో ఆ సీరియల్ సక్సెస్ ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అని అడగ్గా.కార్తీకదీపం ఇంత ఆదరణ పొందడం సంతోషంగా ఉంది.

ఈ సీరియల్ గురించి మరింత ఉత్సాహం కలుగుతుంది.ఈ సీరియల్ లో ఉన్న క్యారెక్టర్ ఇంతకుముందు తీసిన క్యారెక్టర్ల కంటే భిన్నంగా ఉంది.

నిజానికి ఈ సీరియల్ ఇంత రేంజ్ లో సక్సెస్ అవుతుందని ఎవరు ఊహించుకోలేమని తెలిపారు.

అంతేకాకుండా క్లైమాక్స్ గురించి కొన్ని ప్రశ్నలు వేయగా దీపకు దగ్గరవుతారా లేక మోనిత ను పెళ్లి చేసుకుంటారా అని ప్రశ్నించగా.

నిజానికి బయట ప్రేక్షకులకు ఈ సీరియల్ పట్ల చాలా ఎక్స్ పర్టేషన్స్ ఎక్కువగానే ఉన్నాయని తెలిపాడు.ఈ సీరియల్ ను ఇష్టం వచ్చినట్లు తేడాగా, కొంచెం కొత్తగా చేయాలనుకుంటే.

బయట ఉన్న ఈ సీరియల్ అభిమానులు బస్సులు,లారీలు వేసుకొని వచ్చేలా ఉన్నారని తెలిపారు.ఈ సీరియల్ లో ఎవరికి న్యాయం చేయాలో వారికే చేస్తామంటూ తెలిపారు.

కాగా ఈ సీరియల్ ఎన్ని కాలాలపాటు నడుస్తుందో తెలీదు కానీ.పిల్లల పెళ్లిళ్లు అన్నట్లు ట్రీ ప్లానింగ్ ప్రస్తుత ఆలోచనలో లేదని తెలిపారు.

నిరుపమ్ మాటలు బట్టి ఈ సీరియల్ లో వంటలక్కకు న్యాయం జరుగుతుందని అర్థమవుతుంది.

#Premi Viswanath #Doctor Babu #Vantalakka #Karthika Deepam

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు