చిరంజీవి తల్లి ఆ సీరియల్ హీరోను సొంతకొడుకులా చూస్తారట.. ఎవరినంటే?

కార్తీకదీపం సీరియల్ ద్వారా నిరుపమ్ పరిటాల తెలుగు రాష్ట్రాల్లో భారీస్థాయిలో పాపులారిటీని సంపాదించుకున్నారు.ఈ సీరియల్ హీరోకు సోషల్ మీడియాలో భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

 Karthika Deepam Fame Actor Nirupam Paritala Receives A Special Gift From Anjana-TeluguStop.com

సెలబ్రిటీలలో కూడా చాలామంది కార్తీకదీపం సీరియల్ లోని డాక్టర్ బాబు పాత్రను ఎంతగానో ఇష్టపడతారు.అయితే చిరంజీవి తల్లి ఈ సీరియల్ హీరోను సొంతకొడుకులా చూస్తారని సమాచారం.

మెగాస్టార్ తల్లి కూడా డాక్టర్ బాబు అభిమాని కావడం గమనార్హం.

ఒక సందర్భంలో నిరుపమ్ ఈ విషయాన్ని మీడియాతో పంచుకున్నారు.

వేసవికాలంలో అంజనాదేవి నిరుపమ్ కు మామిడి పళ్లను కూడా పంపిస్తారట.నిరుపమ్ పై ఉండే అభిమానాన్ని చిరంజీవి తల్లి మామిడి పండ్లను పంపించడం ద్వారా స్పెషల్ గా తెలియజేస్తుండటం గమనార్హం.

పలువురు సినీ ప్రముఖులు కార్తీకదీపం సీరియల్ లో డాక్టర్ బాబు నటనను మెచ్చి ఫోన్ చేసి మరీ ప్రశంసలు కురిపించినట్లు తెలుస్తోంది.

Telugu Anjanadevi, Babu, Karthikadeepam, Mangoes Gift, Gift, Tollywood-Movie

కార్తీకదీపం సీరియల్ లో కార్తీక్ అనే పేరు కంటే డాక్టర్ బాబు అనే పేరు ద్వారానే నిరుపమ్ కు పాపులారిటీ భారీ స్థాయిలో పెరిగింది.ఇప్పటివరకు నిరుపమ్ నటించిన అన్ని సీరియల్స్ లో ఈ సీరియల్ కే టాప్ రేటింగ్ రావడం గమనార్హం.ప్రస్తుతం నిరుపమ్ ఈ సీరియల్ తో పాటు జీ తెలుగు ఛానల్ లో ప్రసారమవుతున్న హిట్లర్ గారి పెళ్లాం సీరియల్ లో నటిస్తున్నారు.

ఈ సీరియల్ కు నిరుపమ్ నిర్మాత కావడం గమనార్హం.

Telugu Anjanadevi, Babu, Karthikadeepam, Mangoes Gift, Gift, Tollywood-Movie

గుర్తింపు తెచ్చిపెట్టే పాత్రలు వస్తే సినిమాల్లో కూడా నటించాలని నిరుపమ్ భావిస్తున్నారని తెలుస్తోంది.నిరుపమ్ తండ్రి గొప్ప రచయిత కావడంతో నిరుపమ్ రైటర్ గా కూడా పాపులారిటీని సంపాదించుకున్నారు.కెరీర్ తొలినాళ్లలో కొన్ని సినిమాల్లో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నిరుపమ్ నటించిన సంగతి తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube