కార్తీక మాసంలో దీపం వెలిగించటం వలన కలిగే అద్భుతాలు తెలిస్తే రోజు వెలిగిస్తారు  

Karthika Deepalu Importance-

దైవ భక్తి ఉన్నవారు సంవత్సరం మొత్తం దీపం వెలిగించకపోయిన కార్తీక మాసం నెల రోజులు దీపం వెలిగిస్తే చాలా మంచిదని మన పెద్దలు చెప్పుతున్నారు.కార్తీక పురాణం ప్రకారం కార్తీక మాసంలో పిప్పలుడు అనే మహారాజు దీపదానం చేయడం వలన సంతానాన్ని పొందాడనీ, వారి కుమారుడైన శత్రుజిత్తు ఈ మాసంలో దీపాన్ని వెలిగించడం వలన కైలాసాన్ని చేరుకున్నాడనీ కథలు ఉన్నాయి.

కార్తీక మాసంలో నదీ స్నానము,దీపం వెలిగించటం,ఉపవాసాలు,వనభోజనాలు ముఖ్యమైనవి.కార్తీక మాసంలో దీపం వెలిగించటానికి అనేక కారణాలు ఉన్నాయి.

Karthika Deepalu Importance- Telugu Devotional Bhakthi(తెలుగు భక్తి ) Karthika Deepalu Importance---

వాటి గురించి తెలుసుకుందాం.దీపం వెలిగించటానికి ఆవునేయ్యి, నువ్వుల నూనె, ఆముదం దేనిని అయినా ఉపయోగించవచ్చు.

ఆ ఫ్లేమ్ వెదజల్లే వాసనలు పీల్చడం వలన ఎన్నో ఆరోగ్య సమస్యలకు నిరోధంగా పనిచేస్తుంది.అలాగే దృష్టి మెరుగుపడుతుంది.అలాగే మానసిక ప్రశాంతత కలుగుతుంది.

ఆవునేయ్యి, నువ్వుల నూనె, ఆముదం ఈ మూడు సాంద్రత ఎక్కువగా ఉండుట వలన దీపం ఎక్కువ సేపు వెలుగుతుంది.

దాంతో వేడి ఎక్కువసేపు ఉండి చలి తగ్గుతుంది.

కార్తీక మాసంలో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోయి చలి ఎక్కువగా ఉండుట వలన జలుబు, దగ్గు,ఆస్తమా వంటి సమస్యలు వస్తాయి.

ఆవునెయ్యి, నువ్వులనూనె నుంచి వెలువడే ఫ్లేమ్ కి శ్వాసకోశ సంబంధ వ్యాధులు తగ్గుతాయి.

కార్తీక మాసం ప్రతి రోజు సాయంత్రం శివాలయంలో దీపం వెలిగించాలి.

శివాలయం నకు వెళ్ళటం కుదరకపోతే ఇంటిలో దేవుడి గదిలో గాని, తులసి కోట దగ్గర కానీ దీపం వెలిగించాలి.

Karthika Deepalu Importance- Telugu Devotional Bhakthi(తెలుగు భక్తి ) Karthika Deepalu Importance-- Telugu Related Details Posts....

DEVOTIONAL