ప్రముఖ టాలీవుడ్ నటుడు కార్తీక్ రత్నంకు( Karthik Ratnam ) ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు.తక్కువ సినిమాలే చేసినా కార్తీక్ రత్నం తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కార్తీక్ రత్నం ఆ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెల్లడించారు.కేరాఫ్ కంచరపాలెం( C/o Kancharapalem ) స్క్రిప్ట్ నేను మొదట విన్న మూవీ స్క్రిప్ట్ అని కార్తీక్ రత్నం కామెంట్లు చేయడం గమనార్హం.
ఆ సినిమాకు ముందు నాకు ఆఫర్లు రాలేదని కార్తీక్ రత్నం అన్నారు.నేను మాట్లాడే యాసకు కంచరపాలెం యాసకు తేడా ఉందని ఆయన తెలిపారు.కెమెరా పెట్టగానే నేను గట్టిగా మాట్లాడేవాడినని నాటకాల్లోఅనుభవం వల్ల అలా చేశానని కార్తీక్ రత్నం వెల్లడించారు.నేను గతంలో ఒక సీరియల్( Serial ) కు మేనేజర్ గా పని చేశానని ఆయన పేర్కొన్నారు.
వెంకటేశ్ మహాకు థ్యాంక్స్ చెప్పుకోవాలని కార్తీక్ రత్నం వెల్లడించారు.
సినిమా ఆఫర్ల కోసం ఎంతోమందిని అడిగానని ఆయన పేర్కొన్నారు.డాడీ చాలా సపోర్ట్ చేశారని ఆయన పేర్కొన్నారు.సినిమా రంగంలో వాస్తవ పరిస్థితులు ఇప్పుడు అర్థమయ్యాయని ఆయన వెల్లడించారు.
కేరాఫ్ కంచరపాలెం సినిమా ఏడెనిమిది సార్లు చూస్తే మాత్రం అర్థం కాలేదని కార్తీక్ రత్నం పేర్కొన్నారు.ఆశాపాశం సాంగ్ గురించి ఆయన స్పందిస్తూ ఎన్టీఆర్ కు మా ఇంట్లో అందరూ పిచ్చ ఫ్యాన్స్ అని కార్తీక్ రత్నం తెలిపారు.
ఎన్టీఆర్ ఆశాదీపం పాట పాడిన వీడియోను మా అమ్మ వాట్సాప్ గ్రూప్స్ లో షేర్ చేసి తన ఆనందాన్ని పంచుకున్నారని కార్తీక్ రత్నం వెల్లడించగా ఆ విషయాలు నెట్టింట వైరల్ అవుతుండటం గమనార్హం.నేను బస్ లో తిరిగేవాడినని నేను బస్ లో తిరగడం గురించి కూడా నెగిటివ్ కామెంట్లు చేసేవారని ఆయన చెప్పుకొచ్చారు.నాకు కెరీర్ పరంగా గైడ్ చేసేవాళ్లు ఎవరూ లేరని ఆయన కామెంట్లు చేశారు.