మరో పెద్ద సినిమాతో 'ఆహా' అనిపించబోతున్నారట

అల్లు అరవింద్ సారధ్యంలో నడుస్తున్న ఆహా ఓటీటీ గత ఏడాది లాక్ డౌన్‌ సమయంలో మంచి పికప్‌ అందుకుంది.అతి తక్కువ సమయంలో ఎక్కువ కంటెంట్‌ ను ఇవ్వడంతో పాటు అత్యధికులను ఖాతాదారులుగా మార్చుకున్న ఆహా ఓటీటీ వారు తెలుగులో సరికొత్తగా ఓటీటీగా నిలవడంతో పాటు ప్రతి ఒక్కరి అభిమానంను అందుకుంది.

 Karthi Sulthan Movie Streaming Soon In Aha Ott , Aha Ott, Karthi Sulthan Movie,-TeluguStop.com

అందుకే ఆహా తెలుగు వారి ఓటీటీ అంటూ ప్రశంసలు దక్కించుకుంది.ఆహా లో విడుదల అయ్యే ప్రతి కంటెంట్‌ కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు అన్ని విధాలుగా మెప్పిస్తుంది.

కనుక ఆహా ఓటీటీలో విడుదల అయ్యే ప్రతి కంటెంట్‌ కూడా విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంటుంది.ఇప్పటికే పలు చిన్న సినిమాలు పెద్ద సినిమాలతో పాటు అన్ని వర్గాలను ఆకట్టుకునే విధంగా వెబ్‌ సిరీస్‌ లు మరియు టాక్ షో లను కూడా ఆహా వారు ప్రేక్షకులకు అందించారు.

ఆహాలో మరో పెద్ద సినిమా స్ట్రీమింగ్‌ కు సిద్దం అయ్యింది.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం సుల్తాన్ సినిమా తో పాటు థ్యాంక్యూ బ్రదర్ సినిమాలు త్వరలో ఆహా లో రాబోతున్నాయి.

తమిళ స్టార్‌ హీరో కార్తి నటించిన సుల్తాన్ ను పెద్ద ఎత్తున ఆహాలో స్ట్రీమింగ్ చేసేందుకు గాను ఏర్పాట్లు చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ప్రమోషన్‌ కార్యక్రమాలు జోరుగా చేస్తున్నారు.

ప్రముఖ ఓటీటీ లను వదిలి పెట్టి ఆహా లో సుల్తాన్ ను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు అంటే సినిమా మేకర్స్‌ కు ఆహా వారు ఎంత భారీ మొత్తంలో చెల్లించారో అర్థం చేసుకోవచ్చు.పెద్ద ఎత్తున ఆహా లో కంటెంట్‌ వస్తున్న నేపథ్యంలో సుల్తాన్ సినిమా ను కూడా ప్రేక్షకులు తప్పకుండా ఆధరిస్తారనే నమ్మకంను వ్యక్తం అవుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube