`సుల్తాన్‌` లో కార్తీ అదిరిపోయాడుగా..?!

గత సంవత్సరం ఖైదీ అనే థ్రిల్లర్ అనే సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన తమిళ హీరో కార్తీ.ఈయన తాజాగా సుల్తాన్ అనే ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

 Hero Karthi Sultan Poster Release  Karthi, Sulthan, First Look, Dev, Donga, Khai-TeluguStop.com

ఈ సినిమాలో హీరో కార్తి సరసన రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది.అలాగే ఈ సినిమాకి రేమో సినిమాకి దర్శకత్వం వహించిన రాజ్ దర్శకత్వం వహించబోతున్నారు.

ఇక ఈ సినిమాను డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ అనే బ్యానర్ పై ప్రకాష్ బాబు, ప్రభు తెరకెక్కిస్తున్నారు.ఇకపోతే ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా జరుపుకుంటోంది.

తాజాగా చిత్రయూనిట్ ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసింది.

ఈ పోస్టర్ లో భాగంగా హీరో కార్తీక్ చాలా స్టైలిష్ గా, కోపంగా ఉన్న లుక్ తో కనిపిస్తున్నాడు.

ఆయన చేతిలో ఓ పెద్ద కొరడా కూడా కనిపిస్తోంది.ఈ పోస్టర్ చూస్తుంటే సినిమాలో మాస్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్నట్లు కనబడుతుంది.ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ తమిళ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.ఈ పోస్టర్ ను హీరో కార్తీ తన ట్విట్టర్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు.

ఈ పోస్టర్ అందరికీ నచ్చుతుంది అన్నట్లు హీరో కార్తీ తెలిపారు.

ఇకపోతే గత సంవత్సరం హీరో కార్తీ ఏకంగా మూడు సినిమాలు చేసాడు.

దేవ్, దొంగ, ఖైదీ సినిమాలను ఆయన ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.అయితే ఇందులో దొంగ, దేవ్ సినిమాలు బాక్స్ ఆఫీసు వద్ద బోల్తా కొట్టగా ఖైదీ భారీ విజయం సాధించింది.

చూడాలి మరి ఖైదీ తర్వాత మరోసారి తన జైత్రయాత్రను కొనసాగిస్తాడో లేదో.సుల్తాన్ సినిమాకి వివేక్ మెర్విన్ సంగీతం సమకూరుస్తుండగా, సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube