కార్తి అది మాత్రం రివీల్ చేయట్లేదు..!  

Karthi Doesn’t Reveal Third Character Of Kashmora -

కార్తి హీరోగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా కాష్మోరా.గోకుల్ డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమా పివిపి బ్యానర్లో రాబోతుంది.

దీపావళి కానుకగా రిలీజ్ అవుతున్న ఈ సినిమా ట్రైలర్ తో ఒక్క సారిగా అంచనాలను పెంచేశాడు.ట్రైలర్ లోనే చాలా పెద్ద సీక్వెన్సెస్ ఉన్నాయని చెప్పిన కార్తి సినిమా ఇంకా మెస్మరైజింగ్ గా ఉంటుందని అంటున్నాడు.

Karthi Doesn’t Reveal Third Character Of Kashmora--Telugu Tollywood Photo Image

ఇక తాను ఈ సినిమాలో మూడు విభిన్న పాత్రల్లో నటించానని చెబుతూ ఒకటి రాజ్ నాయక్ కాగా మరోటి కాష్మోరా పాత్ర అని ఈ రెండు సినిమాకు చాలా కీలకమైన పాత్రలని అంటున్నాడు.ఇక తను చేసిన మూడో పాత్ర గురించి మాత్రం కార్తి ఎక్కడ రివీల్ చేయట్లేదు.

అది మాత్రం కచ్చితంగా సస్పెన్స్ అంటున్నాడు కార్తి.నయనతార, శ్రీదివ్య హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమా కచ్చితంగా ప్రేక్షకులకు నచ్చే సినిమా అవుతుందని నమ్మకంతో చెబుతున్నారు.

కార్తి చేసిన ఊపిరి తెలుగులో మంచి హిట్ సాధించింది.కోలీవుడ్ తో పాటుగా టాలీవుడ్ లో కూడా మంచి మార్కెట్ ఏర్పరచుకున్న కార్తి ఇక్కడ స్టార్ హీరోలకు పోటీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు.

మరి కార్తి కాష్మోరా ఎలాని ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

footer-test