హీరో కార్తి కన్నీరు, ఎందుకో తెలిస్తే సెల్యూట్‌ చేస్తారు  

Karthi Breaks Down In Tears At His Fan Jeevan Kumar Death - Telugu Fan Jeevan Kumar Death, Hero Karthi, Kaithi Movie, Karthi Was Moved To Tears, తమిళ హీరోలు, హీరో కార్తి

తమిళ స్టార్‌ హీరో కార్తి తాజాగా ఖైదీ సినిమాతో సక్సెస్‌ దక్కించుకున్నాడు.తెలుగు మరియు తమిళంలో ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

Karthi Breaks Down In Tears At His Fan Jeevan Kumar Death

అలాంటి సక్సెస్‌ను దక్కించుకున్న కార్తి తాజాగా ఒక సంఘటన కారణంగా కన్నీరు పెట్టుకున్నాడు.ఆ సంఘటన ఏంటో తెలిస్తే అంతా అవాక్కవుతున్నారు.

కార్తి తన అభిమాని మృతి కారణంగా కన్నీరు పెట్టుకున్నాడు.అభిమాని మృత దేహంను చూసి కన్నీరు ఆపుకోలేక చిన్న పిల్లాడిలా ఏడ్చిన వీడియోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

పూర్తి వివరాల్లోకి వెళ్తే కార్తి చేసే పలు సేవా కార్యక్రమాల్లో కీలకంగా వ్యవహరించిన కార్తి అభిమాని అయిన వ్యాసై రోడ్డు ప్రమాదంలో ఇటీవల మరణించాడు.తంబి సినిమా ఆడియో విడుదల కార్యక్రమంకు హాజరు కావాల్సి ఉన్నా కూడా కార్తి ప్రత్యేకంగా వ్యాసై మృతి విషయం తెలిసి అతడి ఇంటికి వెళ్లాడు.

కుటుంబ సభ్యులను ఓదార్చాడు.వారికి తన సంతాపం తెలియజేయడంతో పాటు వారికి తన ఆర్థిక సాయంను అందజేస్తానంటూ ప్రకటించాడు.

తన సినిమా తంబి ఆడియో వేడుక సందర్బంగా కూడా వ్యాసై ఆత్మకు శాంతి కలగాలంటూ కోరుకుని అభిమానులతో మౌనం పాటింపజేశాడు.ఒక అభిమానిపై కార్తి చూపించిన అభిమానంకు నెటిజన్స్‌ ఫిదా అవుతున్నారు.తమిళ హీరోలు మాత్రమే ఇలా ఉంటారు.తెలుగు హీరోలు ఇంత మంచి మనసుతో ఆలోచిస్తారా అంటూ అంతా కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.