ఖైదీ చిత్రంలో అదే హైలైట్ అంటోన్న చిత్ర యూనిట్

తమిళ హీరో కార్తీకి తెలుగునాట కూడా మంచి ఫాలోయింగ్ ఉంది.హీరో సూర్య సోదరుడిగా ఎంట్రీ ఇచ్చినా, తనకంటూ ప్రత్యేక ఫాలోయింగ్ క్రియేట్ చేసుకుని వరుసగా సినిమాలు చేస్తూ వస్తోన్నాడు.

 Karthi 3 Minute Single Shot Highlight In Khaidi-TeluguStop.com

ఆవారా సినిమాతో మొదలైన కార్తీ కెరీర్ ప్రయాణం తాజా చిత్రం ఖైదీ వరకు కొన్ని హిట్లు, కొన్ని ఫ్లాపుల చందాన సాగుతోంది.అయితే తాజాగా ఖైదీ అనే చిత్రంతో వస్తోన్న కార్తీ ఈ సినిమా విజయంపై ధీమా వ్యక్తం చేస్తు్న్నాడు.

అయితే ఈ సినిమాలో ఓ ఆసక్తికరమైన అంశం ప్రేక్షకులను ఖచ్చితంగా అలరిస్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.ఈ సినిమాలో ఏకంగా 3 నిమిషాల పాటు ఓ షాట్‌లో నటించాడట కార్తీ.

ఈ సీన్ సినిమాకే హైలైట్‌గా నిలవనుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

Telugu Karthi, Khaidi, Telugu-

ఈ సినిమాలో కార్తీ ఓ జీవిత ఖైది లాగా నటిస్తున్నాడు.తనకు జీవిత ఖైదు ఎందుకు పడింది.అనేది చిత్ర కథ అంటోన్నారు చిత్ర యూనిట్.

ఇక ఈ సినిమాలో ఎమోషన్‌లకు ఏమాత్రం కొదువ లేదని అంటోన్నారు చిత్ర యూనిట్.కార్తీ, తన కూతురు మధ్య సాగే ఎమోషన్‌ ఆడియెన్స్‌ను ఖచ్చితంగా మెప్పిస్తుందని తెలిపారు.

నేడు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్న ఈ సినిమాకు మంచి బజ్ క్రియేట్ అయ్యింది.ఈ సినిమాను దర్శకుడు లేకోష్ కనగరాజ్ డైరెక్ట్ చేస్తుండగా తెలుగులో రాధా మోహన్ ప్రొడ్యూస్ చేసి రిలీజ్ చేస్తున్నారు.

మరి ఈ సినిమాకు ఆ సీన్ ఎంత హెల్ప్ అవుతుందో సినిమా చూస్తే తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube