డాక్టర్ బాబును ముద్దు పెట్టుకున్న వంటలక్క.. అసలేమైందంటే..?

ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానెల్స్ లో ఒకటైన స్టార్ మా ఛానెల్ లో గడిచిన నాలుగు సంవత్సరాలుగా కార్తీకదీపం సీరియల్ ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే.మొదట్లో ఈ సీరియల్ కు ప్రేక్షకుల నుంచి పెద్దగా ఆదరణ లేకపోయినా తరువాత రోజుల్లో ఈ సీరియల్ కు రికార్డు స్థాయిలో టీఆర్పీ రేటింగ్ లు రావడంతో ఈ సీరియల్ నంబర్ 1 సీరియల్ గా గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు హిట్ సీరియల్ గా నిలిచింది.

 Karthika Deepam Serial Kiss Episode Promo Goes Viral In Social Media, Karthika-TeluguStop.com

1,000కు పైగా ఎపిసోడ్లతో ప్రసారమవుతున్న అతికొద్ది సీరియళ్లలో కార్తీకదీపం ఒకటి.ఈ సీరియల్ ను సాగదీస్తున్నారని ప్రేక్షకులలో కొంతమంది కామెంట్లు చేసినా సీరియల్ నిర్మాతలకు భారీగా ఆదాయం తెచ్చిపెట్టడంతో పాటు స్టార్ మా ఛానెల్ నంబర్ 1 స్థానంలో ఉండటానికి కారణమవుతోంది.

పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరినీ ఈ సీరియల్ ఆకట్టుకుంటోంది.ప్రస్తుతం దీప అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నారు.

Telugu Babu, Karthikaccepts, Karthikadeepam, Promo, Vankalakka, Vantalakka, Vant

దీప మందులు సరిగ్గా తీసుకోకుండా డాక్టర్ బాబు భార్యగా ఒప్పుకుంటే మాత్రమే మందులు తీసుకుంటానని చెప్పగా డాక్టర్ బాబు దీప చెంపపై గట్టిగా కొడతారు.ఆ తరువాత డాక్టర్ బాబు వంటలక్కను నీ భర్త అనే హక్కుతోనే కొట్టానని డాక్టర్ బాబు చెబుతారు.ఆ తరువాత డాక్టర్ బాబును వంటలక్క ముద్దు పెట్టుకోగా ఆ ప్రోమో నెట్టింట వైరల్ అవుతోంది.కార్తీకదీపం సీరియల్ లో షాకింగ్ ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి.

ప్రోమోలో వంటలక్క డాక్టర్ బాబును ముద్దు పెట్టుకోవడం కల అని కొందరు అభిప్రాయపడుతుంటే నిజమేనని మరి కొంతమంది అభిప్రాయపడుతున్నారు.సీరియల్ కు మంచి రేటింగ్ లు వస్తుండటంతో మరో రెండు మూడేళ్లు ఈ సీరియల్ ను కొనసాగించే అవకాశాలు అయితే ఉన్నాయి.

రాబోయే రోజుల్లో కూడా ఈ సీరియల్ ఇదే స్థాయిలో టీఆర్పీ రేటింగ్ లను సొంతం చేసుకుంటుందో లేదో చూడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube