బిగ్ బాస్ నుంచి ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఆమేనా?

గత సీజన్ల స్థాయిలో కాకపోయినా బిగ్ బాస్ సీజన్ 5 కూడా ప్రేక్షకులకు బాగానే ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే.ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేని కంటెస్టెంట్లు సీజన్ 5లో పాల్గొన్నారని కామెంట్లు వినిపిస్తున్నా రవి, లోబో, షణ్ముఖ్, ప్రియ వల్ల ఎక్కువమంది ఈ షోపై ఆసక్తి చూపిస్తున్నారు.

 Kartheekadeepam Fame Umadevi Will Eliminate In Bigg Boss Second Week Nominations-TeluguStop.com

తొలి వారం బిగ్ బాస్ హౌస్ నుంచి సరయు ఎలిమినేట్ కాగా రెండో వారం నామినేషన్ కు ఏడుగురు హౌస్ మేట్స్ నామినేట్ అయ్యారు.

కార్తీకదీపం సీరియల్ ద్వారా పాపులారిటీని సంపాదించుకున్న ఉమాదేవి తాజాగా ప్రసారమైన ఎపిసోడ్ లో బూతులతో రెచ్చిపోయారు.

 Kartheekadeepam Fame Umadevi Will Eliminate In Bigg Boss Second Week Nominations-బిగ్ బాస్ నుంచి ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఆమేనా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆమె చేసిన కామెంట్లు విని అవాక్కవడం హౌస్ మేట్స్ వంతైంది.ఈ వారం ఎలిమినేషన్ కు ప్రియ, అనీ మాస్టర్, ప్రియాంక, లోబో, ఆర్జే కాజల్, కార్తీకదీపం ఉమాదేవి, నటరాజ్ మాస్టర్ నామినేట్ అయ్యారు.

ఉమాదేవి, కాజల్, నటరాజ్ మాస్టర్ వీక్ కెంటెస్టెంట్లు కాగా ఈ వారం ఉమాదేవి ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

బిగ్ బాస్ హౌస్ లో ఉమాదేవి ఇష్టానుసారం మాట్లాడటం ఆమెకు మైనస్ గా మారింది.

Telugu Anee Master, Bigg Boss Show, Interesting Facts, Lobo, Natraj Master, Priyanka, Second Week Elimination, Telugu Bigg Boss, Umadevi, Umadevi Elimination Rj Kajal-Movie

అయితే గత వారం జశ్వంత్ పడాల ఎలిమినేట్ అవుతాడని భావిస్తే బిగ్ బాస్ సరయును ఎలిమినేట్ చేసి ట్విస్ట్ ఇచ్చాడు.బిగ్ బాస్ హౌస్ లో సరయుకు లవ్ ట్రాక్ లేకపోవడం వల్లే ఆమెను ఎలిమినేట్ చేశారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.ప్రేక్షకుల్లో ఉమాదేవిపై నెగిటివిటీ అంతకంతకూ పెరుగుతోంది.

Telugu Anee Master, Bigg Boss Show, Interesting Facts, Lobo, Natraj Master, Priyanka, Second Week Elimination, Telugu Bigg Boss, Umadevi, Umadevi Elimination Rj Kajal-Movie

హౌస్ లో కొందరు కంటెస్టెంట్లపై ఇష్టానుసారం చేస్తున్న కామెంట్లు ఆమెకు మైనస్ గా మారుతున్నాయి.మరోవైపు బిగ్ బాస్ షో ఏ స్థాయిలో రేటింగ్స్ సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది.లాంఛింగ్ ఎపిసోడ్ కు మాత్రం రికార్డు స్థాయిలో రేటింగ్స్ వస్తాయని బిగ్ బాస్ ఫ్యాన్స్ భావిస్తున్నారు.

#Lobo #Anee Master #Bigg Boss Show #Umadevi #Natraj Master

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు