ఎన్టీఆర్, నాగార్జునకు భారీ షాకిచ్చిన వంటలక్క.. ఏం జరిగిందంటే?

జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా జెమినీ ఛానల్ లో ఎవరు మీలో కోటీశ్వరులు, నాగార్జున హోస్ట్ గా స్టార్ ఛానల్ లో బిగ్ బాస్ ప్రసారమవుతున్నాయి.ఎవరు మీలో కోటీశ్వరులు షో మూడో వారం యావరేజ్ రేటింగ్ 7.30 కాగా బిగ్ బాస్ సీజన్ లాంఛింగ్ ఎపిసోడ్ కు 15.66, వీక్ డేస్ రేటింగ్ 6 కంటే ఎక్కువగా ఉంది.బిగ్ బాస్ ను అభిమానించే అభిమానులు భారీ సంఖ్యలో ఉండటంతో టైమింగ్స్ మార్చినా షోపై ఎఫెక్ట్ పడలేదు.

 Kartheekadeepam Fame Premi Vishwanath Huge Shock To Ntr And Nagarjuna-TeluguStop.com

ఎన్టీఆర్, నాగార్జునలలో ఎవరినీ తక్కువగా అంచనా వేయడానికి వీలు లేదు.

ఇద్దరు హీరోలకు ప్రేక్షకుల్లో భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.అయితే వీక్ డేస్ రేటింగ్స్ ను పరిశీలిస్తే బిగ్ బాస్, ఎవరు మీలో కోటీశ్వరులు షోల కంటే కార్తీకదీపం సీరియల్ పైచేయి సాధించింది.

 Kartheekadeepam Fame Premi Vishwanath Huge Shock To Ntr And Nagarjuna-ఎన్టీఆర్, నాగార్జునకు భారీ షాకిచ్చిన వంటలక్క.. ఏం జరిగిందంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తెలుగు రాష్ట్రాల్లో కార్తీకదీపం సీరియల్ ను చూస్తున్న ప్రేక్షకులే ఎకువ సంఖ్యలో ఉండటం గమనార్హం.వంటలక్క ఎన్టీఆర్, నాగార్జునలకు షాక్ ఇచ్చారని చెప్పాలి.

రాబోయే రోజుల్లో కూడా వంటలక్క సీరియల్ రేటింగ్ ను ఈ రెండు షోలు దాటడం కష్టమేనని తెలుస్తోంది.కార్తీకదీపం కథ, కథనం బోరింగ్ అయినా ప్రేక్షకులు మాత్రం రియాలిటీ షోల కంటే ఆ సీరియల్ కే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు.1,000 కంటే ఎక్కువ ఎపిసోడ్లు ప్రసారమైన తక్కువ టీవీ సీరియల్స్ లో కార్తీకదీపం కూడా ఒకటని చెప్పవచ్చు.కార్తీకదీపం రేటింగ్ ను రియాలిటీ షోలు కొట్టలేవని ప్రూవ్ అయింది.

Telugu Kartheekadeepam, Nagarjuna, Ntr, Vantalakka-Movie

వెండితెరపై కలెక్షన్ల రికార్డులు సృష్టించిన స్టార్ హీరోలకు బుల్లితెరపై మాత్రం షాకులు తప్పడం లేదు.రేటింగ్ లను పెంచుకోవడం కోసం ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరులు షోకు గెస్ట్ లను ఆహ్వానిస్తుండగా బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీలపై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది.

#Vantalakka #Nagarjuna #Kartheekadeepam

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు