మెగా హీరోకు షాకిచ్చిన వంటలక్క.. అసలేమైందంటే..?

కార్తీకదీపం సీరియల్ బుల్లితెరపై ఎన్నో సంచలనాలను సృష్టించిన సంగతి తెలిసిందే.నెలల తరబడి సాగదీస్తున్నా ఈ సీరియల్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు సీరియల్ నిర్మాతలకు, స్టార్ మా ఛానెల్ నిర్వాహకులకు భారీ లాభాలను అందజేస్తోంది.

 Kartheeka Deepam Serial Rating Higher Than Uppena Rating-TeluguStop.com

వంటలక్క పాత్ర వల్లే ఈ సీరియల్ ఇంత పెద్ద హిట్ అయిందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.అయితే తాజాగా మెగా హీరోకు వంటలక్క భారీ షాక్ ఇచ్చింది.

మెగా హీరో వైష్ణవ్ తేజ్ నటించిన ఉప్పెన సినిమా స్టార్ మా ఛానల్ లో ప్రసారమై రికార్డు స్థాయిలో టీఆర్పీ రేటింగ్ లను సొంతం చేసుకోగా ఆ సినిమా కంటే కార్తీకదీపం సీరియల్ కే ఎక్కువ రేటింగ్ లు రావడం గమనార్హం.ఉప్పెన సినిమా తొలిసారి టీవీలో ప్రసారమైనప్పటికీ ఆ సీరియల్ రేటింగ్ లను కార్తీకదీపం క్రాస్ చేసింది.

 Kartheeka Deepam Serial Rating Higher Than Uppena Rating-మెగా హీరోకు షాకిచ్చిన వంటలక్క.. అసలేమైందంటే..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

గతంలో పలువురు స్టార్ హీరోలకు కూడా వంటలక్క షాకిచ్చిన సంగతి తెలిసిందే.

మెగా ఫ్యామిలీ హీరోలకు ప్రేక్షకుల్లో ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ అంతాఇంతా కాదు.ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ వల్లే ఉప్పెన సినిమాకు థియేటర్లలో ఏకంగా 100 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సాధించింది.ఈ సినిమాను థియేటర్లలో చూడటం మిస్ అయిన వాళ్లు టీవీలో ఎప్పుడెప్పుడూ ఈ సినిమా టెలీకాస్ట్ అవుతుందా ? అని ఆసక్తిగా ఎదురు చూశారు.కార్తీకదీపం రేటింగ్ 14053 కాగా ఉప్పెన రేటింగ్ కేవలం 13320 కావడం గమనార్హం.

మరో వైపు ఈ సీరియల్ లో వంటలక్క, డాక్టర్ బాబు ఎప్పుడు కలుస్తారో అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఈ సీరియల్ నాలుగు సంవత్సరాల నుంచి స్టార్ మా ఛానల్ లో ప్రసారమవుతూ ఉండటం గమనార్హం.

#Fan Following #Uppena Rating #Kartheekadeepam #Vantalakka #Mega Hero

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు