షూటింగ్ గ్యాప్ లో డాక్టర్ బాబు అలా టార్చర్ చేస్తాడట..!

బుల్లితెరపై చాలా సీరియళ్లు ప్రసారమవుతున్నా కార్తీక దీపం సీరియల్ తెచ్చుకున్న స్థాయిలో మరే సీరియల్ గుర్తింపును సంపాదించుకోలేకపోయింది.స్టార్ మా ఛానెల్ లో రాత్రి 7.30 గంటలకు ప్రసారమయ్యే ఈ సీరియల్ రికార్డు స్థాయిలో టీఆర్పీ రేటింగ్ లను అందుకుంటోంది.ఈ సీరియల్ లోని వంటలక్క, డాక్టర్ బాబు పాత్రలు ప్రేమీ విశ్వనాథ్, నిరుపమ్ లకు మంచి పేరు తెచ్చిపెట్టాయి.

 Kartheeka Deepam Fame Sahruda Complaint About Nirupam-TeluguStop.com

ఈ సీరియల్ లో హిమ, శౌర్య పాత్రలు పోషించే కృతిక, సహృద సైతం ఆ పాత్రలకు న్యాయం చేస్తూ బాలనటులుగా పాపులర్ అయ్యారు.సీరియల్ లో హిమ పాత్రలో నటించే సహృద సైలెంట్ గా ఉంటుంది.

కానీ నిజజీవితంలో మాత్రం సహృద చేసే అల్లరి మామూలుగా ఉండదు.మల్టీ టాలెంటెడ్ అయిన సహృద సోషల్ మీడియాలో వీడియోలను పోస్ట్ చేస్తూ తన ప్రతిభను బయటపెడుతూ ఉంటుంది.

చిచ్చరపిడుగు సహృద చేసిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.అయితే తాజాగా నిరుపమ్, సహృద ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ ఇంటర్వ్యూలో సహృద నిరుపమ్ గురించి ప్రేక్షకులకు తెలియని ఎన్నో విషయాల గురించి చెప్పుకొచ్చారు.నిరుపమ్ ను మొదట తాను అన్నయ్య అని పిలిచేదానినని అయితే తనకు మాత్రం అంకుల్ అని పిలవాలని అనిపించేదని అన్నారు.

నిరుపమ్ షూటింగ్ గ్యాప్ సమయంలో ఎక్కువగా ఏడిపిస్తూ ఉంటాడని కోతి అని పిలుస్తూ సరదాగా ఏడిపిస్తాడని సహృద చెప్పారు.నిరుపమ్ కార్తీకదీపం సీరియల్ సక్సెస్ అవుతుందని ఊహించానని అయితే ఈ స్థాయిలో సక్సెస్ అవుతుందని ఊహించలేదని యాంకర్ మలయజతో అన్నారు.మొదట హిమ పాత్రలో నటించాలంటే భయపడ్డానని అయితే సీరియల్ లో నటిస్తానని చెప్పడంతో ఇప్పుడు మాత్రం ఆనందంగా ఉందని సహృద అన్నారు.తన తండ్రి రైటర్ అయినా తనకు యాక్టింగ్ పైనే మొదటినుంచి ఆసక్తి ఉందని నిరుపమ్ తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube