స్టార్ హీరో మూవీలో వంటలక్కకు ఛాన్స్.. ఏ సినిమా అంటే..?

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కార్తీకదీపం సీరియల్ కు ఉండే ఆదరణ అంతాఇంతా కాదు.అసలు పేరు ప్రేమీ విశ్వనాథ్ అయినప్పటికీ వంటలక్కగానే తెలుగు ప్రేక్షకులకు ప్రేమీ విశ్వనాథ్ సుపరిచితం.

 Kartheeka Deepam Fame Premi Vishwanath Got Chance In Ram Linguswamy Movie, Direc-TeluguStop.com

కార్తీకదీపం సీరియల్ లో అద్భుతమైన నటనతో ప్రేమీ విశ్వనాథ్ రోజురోజుకు పాపులారిటీతో పాటు ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు.అయితే సీరియళ్లపైనే దృష్టి పెట్టిన ప్రేమీ విశ్వనాథ్ త్వరలో స్టార్ హీరో మూవీలో నటించనున్నారని తెలుస్తోంది.

లింగుస్వామి డైరెక్షన్ లో రామ్ హీరోగా తెరకెక్కనున్న సినిమా షూటింగ్ త్వరలో మొదలు కానున్న సంగతి తెలిసిందే.యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కనుండగా తెలుగుతో పాటు తమిళంలో కూడా ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం.

ఈ సినిమాలో ప్రేమీ విశ్వనాథ్ నటిస్తున్నారంటూ ఇండస్ట్రీ వర్గాలతో పాటు సోషల్ మీడియాలో కూడా వినిపిస్తోంది.అయితే ఈ మేరకు అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Telugu Linguswamy, Kartheekadeepam, Premi Viswanath, Ram Pothenani, Telugu Seria

ఇండస్ట్రీ వర్గాల్లో ఈ విధంగా ప్రచారం జరగడానికి ముఖ్యమైన కారణమే ఉంది.తాజాగా ప్రేమీ విశ్వనాథ్ డైరెక్టర్ లింగుస్వామిని కలిసిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేశారు.ప్రేమీ విశ్వనాథ్ స్పందించి క్లారిటీ ఇస్తే మాత్రమే ఈ వార్తలో నిజానిజాలు తెలిసే అవకాశాలు ఉంటాయి.

వంటలక్క వరుసగా సినిమా ఆఫర్లతో బిజీ కావాలని ఆమె అభిమానులు కూడా బలంగా కోరుకుంటున్నారు.మరి వంటలక్క సినిమాల విషయంలో ఏ విధంగా ముందుకెళతారో చూడాల్సి ఉంది.

Telugu Linguswamy, Kartheekadeepam, Premi Viswanath, Ram Pothenani, Telugu Seria

ప్రేమీ విశ్వనాథ్ ఈ మూవీలో నటిస్తే మాత్రం ఈ సినిమాపై ప్రేక్షకులో అంచనాలు మరింత పెరిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.మలయాళంలో ఒక సీరియల్ చేయడానికి అంగీకరించిన ప్రేమీ విశ్వనాథ్ తెలుగు సీరియల్స్ లో నటించడానికి ఆసక్తి చూపుతుండటం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube