మోహన్ బాబు అలా చేసి ఉంటే సౌందర్య బ్రతికేది.. దర్శకుడి కీలక వ్యాఖ్యలు?

సాధారణంగా సినిమా డైరెక్టర్లకు వచ్చిన స్థాయిలో సీరియల్ డైరెక్టర్లకు గుర్తింపు రాదనే సంగతి తెలిసిందే.అయితే కార్తీకదీపం సీరియల్ డైరెక్టర్ కాపుగంటి రాజేంద్ర మాత్రం స్టార్ డైరెక్టర్ల స్థాయిలో గుర్తింపును సంపాదించుకున్నారు.

 Kartheeka Deepam Director  Rajendra Comments About Soundarya Death, Interesting-TeluguStop.com

తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన రాజేంద్ర ఎన్నో ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకున్నారు.ఈ సీరియల్ కు మంచి రేటింగ్స్ వచ్చేలా నడిపిస్తున్న కాపుగంటి రాజేంద్ర టాలెంట్ ను మెచ్చుకుంటున్నారు.

కార్తీకదీపం సీరియల్ కు శుభం కార్డు అవుతుందని వస్తున్న వార్తల వార్తల గురించి స్పందిస్తూ సీరియల్ కు బిజినెస్ బాగా జరుగుతోందని మంచి రేటింగ్స్ వస్తున్నన్ని రోజులు కార్తీకదీపం సీరియల్ కొనసాగుతుందని తెలిపారు.ప్రముఖ సినీ నటి సౌందర్య మృతి గురించి రాజేంద్ర మాట్లాడుతూ మోహన్ బాబు గట్టిగా పట్టుబట్టి ఉంటే నటి సౌందర్య బ్రతికేవారని కామెంట్లు చేశారు.

సాధారణంగా నటుడు మోహన్ బాబు షూటింగ్ మొదలైన తర్వాత మధ్యలో ఆర్టిస్ట్ లు ఎక్కడికైనా వెళతామని చెబితే అంగీకరించరని రాజేంద్ర అన్నారు.

శివ్ శంకర్ సినిమా 65 శాతం షూటింగ్ పూర్తైన తరువాత బీజేపీ ఎన్నికల ప్రచారానికి సౌందర్య హెలికాఫ్టర్ లో వెళతానని చెప్పగా సాధారణంగా ఎవరినీ మధ్యలో వెళ్లనివ్వని మోహన్ బాబు సౌందర్య రిక్వెస్ట్ చేయడంతో పంపించారని చెప్పుకొచ్చారు.

సౌందర్య హెలికాఫ్టర్ ప్రమాదంలో చనిపోవడం వల్ల ఆ మూవీ క్లైమాక్స్ లో మార్పులు చేయాల్సి వచ్చిందని శివ్ శంకర్ సక్సెస్ కాకపోవడం తన కెరీర్ పై ప్రభావం చూపిందని రాజేంద్ర అన్నారు.

Telugu Karthika Deepam, Soundarya-Movie

ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు దగ్గర తాను కొన్ని సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశానని తొలిప్రేమ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాల్సి ఉన్నా కొన్ని కారణాల వల్ల పవన్ తో సినిమా కుదరలేదని రాజేంద్ర వెల్లడించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube