లాక్ డౌన్ రూల్స్ బ్రేక్.. బెంగళూరు ఆలయంలో కర్ణాటక సీఎం తనయుడు..!

కరోనా సెకండ్ వేవ్ కేసులు పెరుగుతున్న కారణంగా కర్ణాటకలో లాక్ డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే.కరోనాని నియంత్రించడానికి లాక్ డౌన్ ఒక్కటే మార్గమని కర్ణాటక ప్రభుత్వం భావించింది.

 Karntaka Cm Son Vijayendra Breaks Lockdown Rules Mysore, By Vijayendra, Cm, Karn-TeluguStop.com

ముందు కర్ఫ్యూ విధించినా తర్వాత లాక్ డౌన్ విధించింది.లాక్ డౌన్ టైం లో నిబంధనలు ఉల్లఘించిన వారికి కఠిన శిక్షలు విధిస్తున్నారు.

అయితే అది కేవలం సామాన్య ప్రజలకు మాత్రమే అని అర్ధమవుతుంది.కర్ణాటకలో లాక్ డౌన్ ఉండగా బెంగళూరులో ఓ ఆలయాన్ని సందర్శించాడు ముఖ్యమంత్రి యడియూరప్ప కుమారుడు విజయేంద్ర భార్యతో కలిసి ఆలయాన్ని సందర్శించి పూజలు నిర్వహించారు.

కరోనా ఆంక్షలు, నిబంధనలు సామాన్య ప్రజలకేనా సిఎం కొడుక్కి కాదా అంటూ అక్కడ ప్రజలు ఫైర్ అవుతున్నారు.కర్ణాటక ముఖ్యమంత్రి బి.ఎస్ యడియూరప్ప కుమారుడు బేజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బీవై విజయేంద్ర తన భార్యతో కలిసి మైసూర్ జిల్లాలో నీలకంఠేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు.గర్భ గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించినట్టు తెలుస్తుంది.

ఆయన సందర్శించిన టైం లో భారీ ఎత్తున పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారని సమాచారం.రాష్ట్రమంతా లాక్ డౌన్ ఉంటే సిఎం కుమారుడికి మాత్రం ప్రత్యేక దర్శనం ఎందుకు.

సిఎం కుమారుడికి నిబంధనలు వర్తించవా అంటూ ప్రతి పక్షాలు ఫైర్ అవుతున్నాయి.లాక్ డౌన్ నిబంధనలు అతిక్రమించిన విజయేంద్ర పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి ప్రతిపక్షాలు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube