జాలీ గా క్రికెట్ ఆడిన కర్ణాటక మాజీ సీఎం  

Bs Yeddyurappa Plays Cricket With Party Legislators-

ఒకపక్క కర్ణాటక లో రాజకీయ సంక్షోభం తలెత్తడం తో సంకీర్ణ ప్రభుత్వం తలమునకలు అవుతుండగా బీజేపీ నేతలు మాత్రం జాలీ గా లైఫ్ ని ఎంజాయ్ చేస్తూన్నారు.గత కొద్దీ రోజులుగా కర్ణాటక లో రాజకీయ పరిణామాలు రోజుకొక మలుపు తిరగడం తో ఎప్పడు ఏమి జరుగుతుందా అన్న ఉత్కంఠ నెలకొంటుంది.ఐతే బీజేపీ నేతలు మాత్రం అక్కడ ఏర్పడిన పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకొని ప్రభుతాన్ని ఏర్పాటు చేయాలని తమ పనుల్లో తాము ఉంటూ ఇలా మధ్య మధ్యలో ఆట లు ఆడుతూ సేద తీరుతున్నారు...

Bs Yeddyurappa Plays Cricket With Party Legislators--BS Yeddyurappa Plays Cricket With Party Legislators-

కర్ణాటక మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నేత యడ్యూరప్ప క్రికెట్ ఆడుతూ ఎంజాయ్ చేశారు.ఈ నెల 18న కాంగ్రెస్, జేడీఎస్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం బలనిరూపణ కు సిద్దమైన సంగతి తెలిసిందే.అయితే ఒక్క చిన్న అవకాశం దొరికినా సంకీర్ణ ప్రభుత్వాన్ని తోసేసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనీ చూస్తుంది.మరోపక్క సుప్రీం కోర్టు కూడా ఈ రోజు రెబల్ ఎమ్మెల్యేల కేసును విచారించిన సుప్రీంకోర్టు రాజీనామాలపై తుది నిర్ణయం స్పీకర్ దే అంటూ స్పష్టం చేయడం తో ఇప్పుడు ఇది కష్టాల్లో ఉన్న సంకీర్ణ ప్రభుత్వానికి ప్లస్ పాయింట్ అవ్వనున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Bs Yeddyurappa Plays Cricket With Party Legislators--BS Yeddyurappa Plays Cricket With Party Legislators-

ఎందుకంటే ఇప్పటివరకు కూడా స్పీకర్ రమేష్ కుమార్ రెబల్ ఎమ్మెల్యేల రాజీనామాలు ఆమోదించని నేపథ్యంలో బలనిరూపణ సమయంలో అధికారం లో ఉన్న సంకీర్ణ ప్రభుత్వానికి అనుకూలాంశం కానుంది.అయితే మరోపక్క బీజేపీ కూడా తన స్కెచ్ లతో రెడీ గా ఉంది.ఈ తరుణంలో యడ్యూరప్ప సరదాగా కాసేపు క్రికెట్ ఆడుతూ ఫోటోలలో దొరికారు.బెంగళూరులోని రమదా హోటల్ ప్రాంగంణంలో తమ ఎమ్మెల్యేలతో కలిసి క్రికెట్ ఆడిన యడ్యూరప్ప ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అయ్యాయి.