మరోసారి కర్ణాటక లో రాజకీయ సంక్షోభం,20 మంది వ్యతిరేకత

ఒకపక్క కరోనా తో సతమతమౌతున్న కర్ణాటక సర్కార్ కు ఇప్పుడు మరో గండం వచ్చి పడింది.కరోనా కష్టకాలం లో ఏకంగా ప్రభుత్వమే కూలిపోయే పరిస్థితి ఎదురవ్వనుంది.

 Amid Karnataka's Covid-19 Fight, Yediyurappa Faces Another Battle As 20 Miffed M-TeluguStop.com

కర్ణాటకలో ప్రతిరోజూ రోగుల సంఖ్య కూడా పెరుగుతుండగా కరోనాతో యుద్ధం చేస్తున్న కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యురప్పకు అటు పొలిటికల్ గా కూడా కష్టాలు పెరిగిపోయాయి.సుమారు 20 మంది ఎమ్మెల్యేలు ఆయన పట్ల వ్యతిరేకంగా ఉండడం తో కర్ణాటకలో మరోసారి రాజకీయ సంక్షోభం తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి.

వారందరికీ యడ్యూరప్ప పనితీరు, వ్యవహార శైలి బొత్తిగా నచ్చడంలేదట.మరోవైపు వారంతా ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఉమేశ్ కట్టిని కేబినెట్‌లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

అంతేకాకుండా ఆయన తమ్ముడు రమేశ్ కట్టిని ఈసారి రాజ్యసభకు పంపాలని డిమాండ్ చేస్తున్నారు.దీంతో యడియూరప్ప.వెంటనే కట్టిని చర్చలకు పిలిచి, వివరణ అడిగినట్లు తెలుస్తోంది.ఇదిలావుండగా మరో సీనియర్ ఎమ్మెల్యే, లింగాయత్ వర్గానికి చెందిన బీఆర్ పాటిల్ కూడా యడ్యూరప్పపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తుంది.

యడ్యూరప్ప కు వ్యతిరేకంగా ఉన్న వారంతా కూడా ఉత్తర కర్ణాటకకు చెందినవారు గా తెలుస్తుంది.అయితే, యడ్యూరప్ప మద్దతుదారులు తాజా రాజకీయ పరిణామాలను పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదట.

యడ్యూరప్ప ప్రభుత్వం పూర్తిగా సురక్షితమని ధీమా వ్యక్తం చేస్తున్నారు.మరో యాంగిల్ లో మాత్రం బీజేపీ సర్కార్ కష్టమే అన్న వార్తలు కూడా వస్తున్నాయి.

ఇప్పటికే గతంలో ఏర్పడిన హాంగ్ ప్రభుత్వాన్ని కూలదోసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం విదితమే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube