అక్రమ సంబంధానికి అడ్డు వస్తుందని భార్యకి విషయం ఎక్కించి..  

Husband Killed Her Wife In Karnataka-husband Crime,husband Crime News,husband Latest News,husband News,karnataka Crime News,karnataka Latest News,karnataka News

ప్రస్తుత కాలంలో కొందరు వివాహేతర సంబంధాల మోజులో పడి తమ పచ్చటి కాపురాలను చేజేతులారా తామే నాశనం చేసుకుంటున్నారు.తాజాగా ఓ వ్యక్తి వివాహేతర సంబంధానికి అడ్డు వస్తుందని తన భార్యని దారుణంగా హత్య చేసిన ఘటన కర్నాటకలో చోటు చేసుకుంది.

Husband Killed Her Wife In Karnataka-Husband Crime Husband News Latest Karnataka Karnataka

వివరాల్లోకి వెళితే స్థానిక రాష్ట్రంలోని రామనగరానికి  చెందినటువంటి వెంకటేష్ అనే యువకుడికి అదే ప్రాంతానికి చెందిన దీప అనే యువతితో వివాహం అయింది.అయితే వెంకటేష్ కి మరో మహిళతో వివాహేతర సంబంధం పెళ్లికాక ముందు నుంచే ఉండేది.

అయితే పెళ్లి అయిన తర్వాత తన భర్త ప్రవర్తనలో వచ్చినటువంటి మార్పులను బట్టి దీప అతడికి మరో మహిళతో అక్రమ సంబంధం ఉందని పసిగట్టింది.అంతేగాక తన కళ్లారా చూసి నిర్ధారణ కూడా చేసుకుంది.దీంతో ఈ విషయం గూర్చి తన తల్లిదండ్రులకు తెలిపింది.దాంతో దీప తల్లిదండ్రులు వెంకటేష్ పంచాయతీకి పిలిచి వివాహేతర సంబంధం గురించి నిలదీశారు.

అంతేగాక పచ్చని కాపురంలో ఇలాంటి సంబంధాల కారణంగా  విభేదాలు ఏర్పడుతాయని, ఇకనైనా తన వివాహేతర సంబంధాన్ని తెంచుకొని తన భార్యతో సక్రమంగా కాపురం చేయాలని సర్ది చెప్పి పంపించారు.అయితే అందరి సమక్షంలో నూ ఇక నుంచి బుద్ధిగా ఉంటానని ఒప్పుకొని వెంకటేష్ తన భార్యను తీసుకొని కాపురానికి వెళ్ళాడు.

భార్యను తీసుకొని కాపురానికి వచ్చిన తర్వాత కూడా అతడు అక్రమ సంబంధాన్ని కొనసాగించాడు.దీంతో తో దీప మళ్లీ ఆ విషయాన్ని తెలుసుకుని అతడిని నిలదీసింది.

దీప అలా చేయడమే ఆమె ప్రాణాల మీదకు తెచ్చింది.తన వివాహేతర సంబంధం గురించి తెలియజేసిన దీప పై అతడు కోపం పెంచుకుని ఎలాగైనా తన అడ్డు తొలగించుకోవాలని పథకం పన్నాడు.

ఈ పథకంలో భాగంగా ఆమెకు మెల్లగా ప్రాణం తీసే అటువంటి విషయాన్ని ఆమె శరీరం లోకి ఎక్కించాడు.దీంతో ఆమె నిద్రలోనే ప్రాణాలు వదిలింది.

ఆ తర్వాత అల్లుడు ప్రవర్తనపై అనుమానం వచ్చిన దీప తల్లిదండ్రులు అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఫిర్యాదు నమోదు చేసుకున్న టువంటి పోలీసులు వెంకటేష్ ని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా నేరం అంగీకరించాడు.

దీంతో అతడిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచగా విచారణ నిమిత్తమై రిమాండ్ కి తరలించారు. 

.

తాజా వార్తలు

Husband Killed Her Wife In Karnataka-husband Crime,husband Crime News,husband Latest News,husband News,karnataka Crime News,karnataka Latest News,karnataka News Related....