మేకలను అడవిలో వదిలేసి.. కుక్కను తెచ్చుకున్న గొర్రెల కాపరి!

భారీ వర్షాల కారణంగా ఎక్కడిక్కడ వంకలు వాగులు నిండిపోతున్నాయి.కొన్ని చోట్లా వరదల కారణంగా ఇల్లు ఒక్కసారిగా కుప్పకూలిపోతున్నాయి.

 Karnataka Shepherds, Flood Story, Viral Photo, Internet, Shepherd Boy Was Rescue-TeluguStop.com

వరద నీరు ఊర్లను ముంచేస్తున్నాయి.ఇంకా ఈ నేపథ్యంలోనే కేరళ, కర్ణాటకలో పరిస్థితి దారుణంగా తయారయ్యింది.

భారీ వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
అక్కడ ఎంతోమంది ప్రజలకు ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు సహాయం అందిస్తున్నాయి.

ఇంకా ఈ క్రమంలోనే కర్ణాటకలో ఓ వింత ఘటన చోటు చేసుకుంది.పూర్తి వివరాలలోకి వెళ్తే.

ఓ గొర్రెల కాపరి తన మేకలను మేత కోసం ఆడవికి తీసుకెళ్లాడు.అయితే ఇంతలో కృష్ణ నదికి భారీ వరదలు వచ్చాయి.

ఆసమయంలోనే అక్కడికి ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది వచ్చి సాయం చేసింది.

వారు సహాయం చేస్తున్న సమయంలో అతను తన గొర్రెలను అడవిలోనే వదిలేసి వెంట తెచ్చుకున్న కుక్కను తెచ్చుకున్నారు.

అయితే అలా ఎందుకు చేశావు అని అతన్ని వారు అడగగా అతను చెప్పిన సమాధానం విని వారు ఒక్కసారిగా షాక్ అయ్యారు ఏంటి అనుకుంటున్నారా?

అదేనండి అతని మేకలు అక్కడ ఉన్న గడ్డిని తిని బతకలగుతాయని, కుక్కకు ఆహారం దొరకదని అందుకే కుక్కను కాపాడినట్టు అయన చెప్పాడు.ఈ విషయాన్నీ ఎన్‌డీఆర్‌ఎఫ్ ‌డైరెక్టర్ జనరల్ సత్య ప్రధాన్ ట్విట్టర్ వేదికగా షేర్ చేస్తూ ఫోటోను షేర్ చేశాడు.

ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube