ఇకపై ఆ రాష్ట్రంలో రేషన్ బియ్యం కోసం రైస్ ఏటీఎంలు...!

మామూలుగా చౌక ధరల దుకాణాల వద్ద రేషన్ బియ్యం తెచ్చుకోవాలంటే రేషన్ కార్డు దారులు గంటలకొద్దీ క్యూలో నిలబడి రేషన్ పొందాల్సిన పరిస్థితులు ఎక్కడైనా కనపడతాయి.అది కూడా రేషన్ షాప్ చెందిన వ్యక్తి ఏ సమయంలో వస్తాడో… ఎప్పుడూ తెరుస్తాడో.

 Karnataka State Planning To Install Rice Atms, Karnataka  Rice Atms, Corona Effe-TeluguStop.com

తెలియని పరిస్థితి చాలా రాష్ట్రాల్లో కనపడుతుంది.ఇకపై ఇలాంటి కష్టాలు ప్రజలు పడకూడదని భారతదేశ ప్రభుత్వం లోని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలను తీసుకుంది.

ఇందుకు సంబంధించి కర్ణాటక రాష్ట్ర పౌర సరఫరాల శాఖ త్వరలో బియ్యాన్ని సరఫరా చేసేందుకు కర్ణాటక రాష్ట్రంలో రైస్ ఏటీఎం యంత్రాలను ప్రవేశపెట్టేందుకు ఆలోచన చేస్తోంది.

ఈ నూతన విధానం ద్వారా ప్రజలు చౌకదుకాణాల ముందర గంటల తరబడి క్యూలో నిలబడాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం ఆలోచన చేస్తోంది.

ఇందుకు సంబంధించిన విషయాన్ని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ పౌర సరఫరాల మంత్రి కె.గోపాలయ్య సదరు వివరాలను తెలియజేశారు.ఆయన మాట్లాడుతూ… రాష్ట్రంలో మొదటగా కొన్ని రైస్ ఏటీఎంలను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆయన తెలియజేశారు.వీటి ద్వారా రేషన్ దుకాణాల వద్ద ప్రజలు ప్రతినెల ఎదుర్కొనే సమస్యల నుండి దూరం కావచ్చని ఆయన తెలియజేశారు.

అయితే ఇందుకు సంబంధించి ప్రస్తుతం పైలెట్ ప్రాజెక్ట్ లో భాగంగా కేవలం రెండు యంత్రాలని కర్ణాటక కు తెప్పిస్తున్నామని ఆయన తెలియజేశారు.ఇక ఇందుకు సంబంధించి రిజల్ట్స్ బాగా ఉంటే వాటిని రాష్ట్రవ్యాప్తంగా అతి త్వరలో అమలు పరుస్తామని ఆయన తెలిపారు.

వీటి ద్వారా కేవలం రేషన్ దుకాణాలు తెరిచిన సమయంలోనే కాకుండా ఏ సమయంలోనైనా సరే పిడిఎస్ కేంద్రానికి వెళ్లి రేషన్ కార్డు దారులు బియ్యాన్ని తీసుకోవచ్చు.అచ్చం బ్యాంకు ఏటీఎం కార్డు ద్వారా డబ్బులు ఎలా పొందుతారో, అలాగే రైస్ ఏటీఎంలో నుండి బియ్యాన్ని అలా పొందవచ్చు.

ఇందుకు సంబంధించి ఏటీఎం కార్డు లాగే స్మార్ట్ కార్డు సదుపాయాన్ని కల్పించనున్నట్లు ఆయన తెలియజేశారు.అయితే ఇలాంటి విధానాన్ని కరోనా ఉధృతి ఎక్కువగా ఉన్న సమయంలో ముందుగా ఇండోనేషియా, వియత్నం దేశాలలో వీటిని అక్కడ ఉపయోగించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube