కెమెరాలో జీవిస్తున్న కుటుంబం.. ఎక్కడంటే!

మామూలుగా చాలా మందికి కెమెరా అంటే ఎంతో ఇష్టం ఉంటుంది ఈ క్రమంలోనే చాలామంది ఫోటోగ్రాఫర్ గా మారిపోతారూ .ఫోటోగ్రఫీని తమ ప్రొఫెషనల్ గా ఎంచుకుంటూ ఎప్పుడు కెమేరా ని అంటిపెట్టుకొని వుంటారు.

 Karnataka Photographer Builds Camera Shaped House, Camera House, Karnataka, Karn-TeluguStop.com

కానీ ఇక్కడ ఉన్న వ్యక్తికి కెమేరా అంటే అంతకు మించి అనేలా పిచ్చి ఉంది.కెమేరా ని అంటి పెట్టుకుని తిరగడం ఏమో కానీ ఏకంగా తన ఇల్లుని కెమేరా గా మార్చుకున్నాడు.

తన పిల్లలకు కూడా కెమెరాపేర్లు పెట్టాడు.ఇదంతా నమ్మాలి అనిపించట్లేదు కదా.

కానీ ఇది నిజమే.వివరాల్లోకి వెళితే.

కర్ణాటకలోని బెల్గాంకు చెందిన రవి పొంగల్ అనే ఒక ఫోటోగ్రాఫర్… వృత్తినే దైవంగా భావిస్తూ ఉంటాడు.ప్రస్తుతం తన జీవనోపాధి కెమెరా నే అన్న భావనతో ఏకంగా తన ఇంటినే కెమేరా గా మార్చుకున్నాడు.

ఒక కెమెరా ఎలా ఉంటుందో అతని ఇల్లు కూడా అలాగే డిజైన్ చేయించుకున్నాడు రవి.అంతేకాదు తన కుమారులకు కెనాన్ ఎప్సన్ అనే కెమెరాల పేర్లు పెట్టుకోవడం నిజంగా ఆశ్చర్యమే.
ప్రస్తుతం ఇలా తన ఇంటిని కెమెరా లాగా డిజైన్ చేసి సోషల్ మీడియాలో తెగ పాపులర్ అయిపోయాడు రవి.ఈ ఇల్లును సరిగ్గా గమనిస్తే కెమేరా కి సంబంధం ఉండే మెమొరీ కార్డ్ షోరిల్ ఫ్లాష్ లెన్స్ ఇలా అన్ని కనిపిస్తూ ఉంటాయి.కేవలం బయట మాత్రమే కెమెరాలా ఉంది అనుకుంటే మాత్రం పొరపాటు లోపల కూడా పూర్తిగా ఇలాంటి విభిన్నమైన డిజైన్లు కనిపిస్తూ ఉంటాయి.అయితే ఇలా తన ఇంటిని కెమెరా లా మార్చుకోవడానికి ఏకంగా 71.63 లక్షలు వెచ్చించాడట ఫోటోగ్రాఫర్ రవి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube