నిఖిల్‌ పెళ్లి అనుకున్న తేదీకే జరుగబోతుంది, ఆపేది లేదంటున్న ఫ్యామిలీ

తెలుగు హీరోలు నితిన్‌, నిఖిల్‌లు వారి వారి పెళ్లిలను ప్రస్తుతానికి వాయిదా వేసుకున్న విషయం తెల్సిందే.దేశ వ్యాప్తంగా ఉన్న పరిస్థితుల నేపథ్యంలో పెళ్లి ఏమాత్రం కరెక్ట్‌ కాదని, పరిస్థితులు అన్ని కూడా సర్దుమణిగిన తర్వాత మళ్లీ పెళ్లి గురించి ఆలోచించాలని మన తెలుగు హీరోలు నిర్ణయించుకున్నారు.

 Nikhil Gowda Marriage Doing With Same Date, Karnataka, Nikhil Gowda, Jagwar, Nit-TeluguStop.com

కన్నడ హీరో నిఖిల్‌ గౌడ మాత్రం తన పెళ్లి విషయంలో ఎలాంటి రాజీ లేకుండా ముందుకు వెళ్తున్నాడు.ఏప్రిల్‌ 17వ తారీకును పెళ్లి చేసుకుని తీరాలనే పట్టుదతో ఉన్నట్లుగా కన్నడ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

Telugu Jagwar, Kannada, Karnataka, Nikhil Gowda, Nithin Nikhil, Tollywood-Movie

నిఖిల్‌ గౌడ వివాహ నిశ్చితార్థం కొన్ని రోజుల క్రితం అత్యంత వైభవంగా కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగిన విషయం తెల్సిందే.ఆ వేడుకను మించి ఏప్రిల్‌ 17న పెళ్లి చేయాలని అనుకున్నారు. కాని కరోనా నేపథ్యంలో పెళ్లిలు చేసుకోవద్దనే ఆదేశాలు కేంద్రం ఇవ్వకున్నా కూడా అనధికారికంగా వేడుకలను జరుగనివ్వడం లేదు.పెద్ద ఎత్తున ఉన్న కరోనా విపత్తును దృష్టిలో పెట్టుకుని అంతా పెళ్లిలు క్యాన్సిల్‌ చేసుకుంటుండగా నిఖిల్‌ పెళ్లి మాత్రం జరుగబోతుందని ప్రకటించారు.

కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో నిరాడంబరంగా సామాజిక దూరం పాటిస్తూ పెళ్లి చేసుకోవాలనే నిర్ణయానికి నిఖిల్‌ వచ్చాడట.రెండు కుటుంబాలు కూడా ఇదే నిర్ణయానికి రావడంతో నిఖిల్‌ గౌడ పెళ్లికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.సాదారణంగా అయితే అంగరంగ వైభవంగా జరగాలి.కాని చాలా సింపుల్‌గా ఇంట్లోనే వీరిద్దరి పెళ్లిని చేయబోతున్నట్లుగా కుటుంబ సభ్యులు ప్రకటించారు.కేవలం 50 మంది కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వివాహం జరుగబోతుందని అంటున్నారు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube