మానవత్వం అంటే ఇదేనేమో: హిందూ బాలిక కు తండ్రిగా మారి ఆమె పెళ్లిని చేసిన ముస్లిం వ్యక్తి..!

మన భారతదేశంలో ఎన్నో మతాలు, జాతులు ఉండటం మనందరికీ తెలిసిన విషయమే.అయితే చాలాసార్లు హిందువులకు ముస్లింలకు సంబంధించిన గొడవలు ఎత్తిచూపడం లాంటి సన్నివేశాలను సినిమాలలో చూస్తూ ఉండడం గమనించాము.

 Karnataka Muslim Man Done Marriage To Orphaned Girl With Hindu Tradition-TeluguStop.com

అయితే ప్రస్తుతం ప్రపంచం పూర్తిగా మారిపోయింది.ఎక్కడ కూడా మతసామరస్యం లేకుండా అందరూ కలిసి మెలసి జీవిస్తూ ముందుకు సాగుతున్నారు.

ఇక అసలు విషయంలోకి వెళితే.

 Karnataka Muslim Man Done Marriage To Orphaned Girl With Hindu Tradition-మానవత్వం అంటే ఇదేనేమో: హిందూ బాలిక కు తండ్రిగా మారి ఆమె పెళ్లిని చేసిన ముస్లిం వ్యక్తి..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరూ వారి చుట్టుపక్కల వారికి కూడా వీలైనంత సహాయం చేస్తూ ముందుకు సాగుతున్నారు.

అయితే తాజాగా మత సామరస్యాన్ని చాటుతూ ఓ సంఘటన చోటు చేసుకుంది.కర్ణాటక రాష్ట్రానికి చెందిన మెహబూబ్ మస్లి అనే వ్యక్తి వారి చుట్టుపక్కల అనాథగా మారిన పూజ అనే ఓ బాలికను అతడు చేరదీశాడు.10 సంవత్సరాల క్రితం ఆ అమ్మాయిని చేరదీసి తండ్రిలా మారాడు.ఇకపోతే ప్రస్తుతం ఆ అమ్మాయికి 18 సంవత్సరాలు నిండాయి.

దీంతో అతడు తన కూతురికి పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నాడు.అయితే పూజ హిందూ మతానికి చెందినది కావడంతో మహబూబ్ కూడా ఆమెకు హిందూ మత సంప్రదాయంలో ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా ఓ హిందూ వ్యక్తితో వివాహం జరిపించాడు.

Telugu Daughter Pooja, Girl, Hindu Boy, Hindu Muslim, Karnataka, Mahaboob Masli, Marries, Muslim Man, Netizens Comments, Orphaned Hindu, Social Media, Vedic Traditions, Viral News-Latest News - Telugu

మెహబూబ్ మస్లి ముస్లిం వ్యక్తి అయినా సరే.ఆ అమ్మాయిని 10 సంవత్సరాలుగా పెంచుతూ ఉన్న కానీ.ఆ అమ్మాయిని ఎప్పుడు ఇస్లాం మతం లోకి రావాలని చెప్పలేదని అతను చెప్పుకొచ్చాడు.మెహబూబ్ కి ఇదివరకే ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కొడుకులు ఉన్నప్పటికీ పూజను చేరదీసి తన దయ హృదయాన్ని చాటుకున్నాడు.

ఇక పెళ్లి విషయంలో పూజని పెళ్లి చేసుకున్న వరుడు, అలాగే వారి తల్లిదండ్రులు ఎటువంటి కట్నకానుకలు డిమాండ్ చేయలేదని ఆయన చెప్పుకొచ్చారు.

Telugu Daughter Pooja, Girl, Hindu Boy, Hindu Muslim, Karnataka, Mahaboob Masli, Marries, Muslim Man, Netizens Comments, Orphaned Hindu, Social Media, Vedic Traditions, Viral News-Latest News - Telugu

అంతేకాకుండా ప్రజలందరూ మతాల మధ్య వివాదాలు చూడకుండా మత సామరస్యంగా జీవించాలి అంటూ ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశాడు.ఈ విషయం సంబంధించి కూతురు పూజ మాట్లాడగా.విశాల హృదయం కలిగిన తల్లిదండ్రులు నాకు దొరకడం అదృష్టం అంటూ చెప్పుకొచ్చింది.

వారు తనను కంటికి రెప్పలా కాపాడుకుంటూ పెంచి పెద్ద చేశారని ఆవిడ తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలియజేసింది.ఈ విషయం కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రస్తుతం మహబూబ్ ను నెటిజెన్స్ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

#Karnataka #Social Media #Marries #Daughter Pooja #Hindu Muslim

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు