ప్రజల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కర్ణాటక మంత్రి.. ?

సమాజంలో రాజకీయ నాయకులు ఉన్నదే ప్రజల కోసం.ప్రజల చేత ఎన్నుకోబడిన తర్వాత అదే ప్రజలను చులకనగా చూసే నేతలు ఎందరో నేడు సమాజంలో ఉన్నారు.

 Karnataka Minister Umesh Katti Makes Controversial Comments About People , Karna-TeluguStop.com

ప్రజలకు చేరవలసిన పధకాలను పందికొక్కుల్లా మేస్తూ కోట్లకు కోట్లు సంపాధిస్తూ పేదలను ఇంకా పేదవారిగానే మారుస్తున్నారు.ఇదేంటని ధైర్యం చేసి ఎదిరిస్తే వారి మీద నోరు జారడం, చేయి చేసుకోవడం, కేసులు పెట్టడం చేస్తున్నారు.

ప్రస్తుతం కర్ణాటక మంత్రి ఒకరు ఇలానే నోరు జారి చివరికి క్షమాపణలు చెప్పిన సంఘటన చోటు చేసుకుంది.ఆ వివరాలు చూస్తే.కర్ణాటక ప్రభుత్వం ప్రజలకు ఉచితంగా ఇవ్వాల్సిన ఐదు కిలోల బియ్యం స్థానంలో, గోధుమలు, జొన్నలు జోడించి బియ్యాన్ని రెండు కిలోలకు తగ్గించింది.ఈ విషయంలో గదగ జిల్లాలో రైతులు ఆందోళనకు దిగారు.

ప్రస్తుతం కరోనా వల్ల లాక్‌డౌన్ అమలవుతుందని రెండు కిలోల బియ్యం ఎటూ సరిపోవని, కాబట్టి ఐదు కేజీల బియ్యం ఇవ్వాలని ఆందోళనకారుల్లో ఒకరు ఆహార, పౌరసరపరాల మంత్రి ఉమేశ్ కత్తికి ఫోన్ చేసి తమ గోడు వినిపిస్తూ తెలిపాడట.

అంతే ఆ మంత్రి అంతెత్తున ఎగిరిపడుతూ బతకలేకపోతే చావండి.

అదే మంచిది.మేం మాత్రం అంతే ఇస్తాం అని దురుసుగా సమాధానం ఇవ్వడంతో ఆయన మాటలు పెద్ద దుమారాన్నే రేపాయి.

ఆ వెంటనే సర్ధుకున్న మంత్రి తాను అలా మాట్లాడిన మాట వాస్తవమేనని అంగీకరిస్తూ క్షమాపణలు చెప్పడంతో వివాదం సద్దుమనిగిందట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube