రియల్‌ హీరో : అనాధ బాలికను పెళ్లి చేసుకున్నాడు.. అతడు ఎందుకలా చేశాడో తెలిస్తే వావ్‌ అంటారు

ఎంత డబ్బుంటే ఏం లాభం మంచి మనసు లేనప్పుడు అంటూ ఒక సినీ కవి ఒక సినిమాలో అన్నాడు.నిజమే కదా కోట్లాది డబ్బుంటే మాత్రం ఏం లాభం సాటి మనిషికి మంచి చేయాలనే ఆలోచన రానప్పుడు, సాయం చేసే గుణం లేనప్పుడు.

 Karnataka Man Got Married With Orphanage Girl In Dharwad Karnataka-TeluguStop.com

ఎలాంటి సాయం చేయకుండా కొందరు కోట్లు కూడబెడుతూ ఉంటారు.కాని కొందరు మాత్రం పెద్దగా ఆస్తులు పాస్తులు లేకున్నా కూడా తమ మంచి మనసు, సాయం చేసే గుణంతో కోటీశ్వరుడి కంటే కూడా ఎక్కువగా పొగడబడతాడు.

రియల్‌ హీరో అనబడతారు.తాజాగా కర్ణాటక రాష్ట్రం ధార్వాడకు చెందిన శ్రీనివాస్‌ దేశ్‌పాండే అనే వ్యక్తి రియల్‌ హీరో అనిపించుకున్నాడు.

రియల్‌ హీరో : అనాధ బాలికను పెళ

పూర్తి వివరాల్లోకి వెళ్తే… మంచి ఉద్యోగం, ఒక మోస్తరు ఆస్తులు ఉన్న శ్రీనివాస్‌ దేశ్‌ పాండేకు పెళ్లి చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు.అప్పుడే అతడు ఆశ్చర్యకర విషయం ఒకటి వారికి తెలియజేశాడు.తాను ఎప్పటి నుండో అనాధ అమ్మాయిని పెళ్లి చేసుకుని ఆమెకు జీవితాన్ని ఇవ్వాలనుకుంటున్నట్లుగా చెప్పుకొచ్చాడు.అతడి ఆలోచనకు మొదట తల్లిదండ్రులు ఇతర కుటుంబ సభ్యులు ఆ తర్వాత ఒప్పుకున్నారు.

ఒకటి రెండు అనాధ ఆశ్రమాలు తిరిగి చివరకు బెళగావిలోని గంగమ్మ చిక్కుంబిమఠ అనే అనాధ ఆశ్రమంలో ఉండే ఆరతి పురాణిమఠ అనే అమ్మాయిని ఎంపిక చేసుకోవడం జరిగింది.

రియల్‌ హీరో : అనాధ బాలికను పెళ

అన్ని ఫార్మాల్టీస్‌ పూర్తి చేసి పెళ్లికి సిద్దం అయ్యాడు.ఇలాంటి పెళ్లిలు సాదా సీదాగా జరుగుతాయి.కాని శ్రీనివాస్‌ మాత్రం తన పెళ్లిని అత్యంత వైభవంగా జరుపుకున్నాడు.

కొన్ని వందల మంది హాజరు అయిన ఈ పెళ్లి గురించి స్థానికంగానే కాకుండా రాష్ట్ర వ్యాప్తగా కూడా చర్చకు తెర లేపింది.ఇలాంటి మంచి మనసున్న వ్యక్తి ఒక అనాధను పెళ్లి చేసుకోవడం పట్ల అందరు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మామూలుగా ఇలాటి అనాధలకు అదే ఆశ్రమంలోని మరో అనాధ కుర్రాడితో పెళ్లి చేస్తూ ఉంటారు.కాని శ్రీనివాస్‌ మంచి మనసుతో అనాధ అయిన ఆరతిని పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ఇచ్చాడు.

అందుకే శ్రీనివాస్‌ దేశ్‌పాండే రియల్‌ హీరో అనడంలో ఎలాంటి సందేహం లేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube