17 ఏళ్లుగా బూడిద తింటూ, బండి ఆయిల్‌ తాగుతూ బతికేస్తున్నాడు.. ఇతడు మనిషేనా అనే అనుమానం!  

Karnataka Man Eating Yash And Drinking Engine Oil Every Day -

ఆకలి వేస్తే అన్నం లేదంటే ఏదైనా ఆహార పదార్థాలు తినాలి, దాహం వేస్తే మంచి నీరు తాగాలి, లేదంటే కూల్‌ డ్రింగ్‌ తాగొచ్చు.ఇది ప్రపంచం మొత్తం జరుగుతున్న రెగ్యులర్‌ పక్రియ.

Karnataka Man Eating Yash And Drinking Engine Oil Every Day

ప్రపంచంలో వంద శాతం మంది ఇలాగే ఉంటారని మనం అనుకుంటాం.కాని ఈమద్య కొందరి పరిస్థితి చూస్తుంటే వంద శాతం కాదు 99.9 శాతం మంది మాత్రమే అవి తింటూ తాగుతున్నారు.కొందరు మాత్రం పకృతికి విరుద్దంగా వెళ్తున్నారంటూ తేలిపోయింది.

ఆమద్య చాలా ఏళ్లుగా కేవలం కాఫీ మాత్రమే తాగుతూ బతికేస్తున్న ఒక మహిళ గురించి తెలుసుకున్నాం కదా, ఇప్పుడు అన్నం మంచినీలు 17 సంవత్సరాలుగా ముట్టని ఒక వ్యక్తి గురించి చూద్దాం.

17 ఏళ్లుగా బూడిద తింటూ, బండి ఆయిల్‌ తాగుతూ బతికేస్తున్నాడు.. ఇతడు మనిషేనా అనే అనుమానం-General-Telugu-Telugu Tollywood Photo Image

కర్ణాటక రాష్ట్రంలోని షిమోగాకు చెందిన కుమార అనే 40 ఏళ్ల వ్యక్తి ఆకలి వేస్తే బూడిద బుక్కుతాడు.

అది కూడా కాగితాలను కాల్చగా వచ్చిన బూడిద అయితే మహా ఇష్టంగా తింటాడు.ఇక దాహం వేస్తే మరీ దారుణంగా వాడి తీసేసిన ఇంజిన్‌ ఆయిల్‌ను తాగేస్తూ ఉంటాడు.17 ఏళ్ల క్రితం తాను ఆకలిని తట్టుకోలేక వీటిని ఉపయోగించుకుని ఆకలి తీర్చుకున్నాను.అప్పటి నుండి నాకు ఇవే జీవితాన్ని కాపాడుతూ వస్తున్నాయని కుమార చెబుతున్నాడు.

తాను యుక్త వయసులో ఉన్న సమయంలో ఒక వ్యక్తి వద్ద పనికి కుదిరాను, ఆ వ్యక్తి నాకు సరిగా తిండి పెట్టకుండా ఉండటంతో పాటు, జీతం కూడా సరిగా ఇచ్చేవాడు కాదు.దాంతో ఆకలితో ఏం చేయాలో తెలియక ఒకసారి బూడిద తిన్నాను.అది నచ్చడంతో దాన్నే కంటిన్యూ చేస్తున్నాను.నీళ్లు తాగేందుకు లేక పోవడంతో అక్కడే షెడ్‌లో ఉన్న వాహనాలకు వాడి తీసేసిన ఆయిల్‌ను తాగడం ప్రారంభించాను.అప్పటి నుండి నాకు ఇవే జీవనాధారాలు అయ్యాయి అన్నాడు.అప్పుడప్పుడు కాఫీ, టీలు తాగుతాడు కాని అన్నం అయితే తినడు, ఎవరైనా పేపర్లు ఇస్తే వాటిని కాల్చుకుని బూడిద రూపంలో తింటాడు.

బూడిద తినడానికి ముందు కాగితాలను కూడా తినేవాడినంటూ కుమార చెబుతున్నాడు.కాగితాలు తినడం వల్ల కడుపు నొప్పిగా ఉంటుండటంతో కాగితాల బూడిదను తినడం ప్రారంభించానంటూ కుమార చెబుతున్నాడు.ఇలాంటివి తింటూ తాగుతూ ఉన్నాడంటే ఇతడు నిజంగా మనిషేనా అనే అనుమానాలు కలుగుతున్నాయి కదా…!

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Karnataka Man Eating Yash And Drinking Engine Oil Every Day- Related....