ఇంగ్లీష్ మీడియం మంచిది కాదంటున్న కర్ణాటక మంత్రి

తెలుగు మాధ్యమాన్ని సమూలంగా తీసేసి నిర్భంద్ ఇంగ్లీష్ మీడియం అమలు చేయడానికి ఏపీ ముఖ్యమంత్రి జగన్ సిద్ధమైన సంగతి తెలిసిందే.అయితే జగన్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని భాషా పండితులు, విద్యావేత్తలు.

 Karnataka Jagan Ammaodi-TeluguStop.com

విపక్ష పార్టీల వారు తీవ్రంగా విమర్శిస్తున్నారు.అయితే జగన్ మాత్రం ఎలా అయిన ఆంగ్ల మాధ్యమాన్ని అమలు చేయాలని చూస్తున్నారు.

తాజాగా హైకోర్టు కూడా నిర్భంద ఆంగ్ల మాధ్యమాన్ని తప్పు పట్టి స్తే ఇచ్చింది.సుప్రీం కోర్టు ఆదేశాలని ఎలా దిక్కరిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

ఇదిలా ఉంటే ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న నిర్ణయాన్ని కర్ణాటకకి చెందిన మంత్రి సురేష్ కుమార్ తప్పు పట్టారు.ఆంగ్ల మాధ్యమంపై జగన్ కి లేఖ రాసారు.

ఈ లేఖలో ఆంగ్ల మాధ్యమం ఉన్నపళంగా ప్రవేశ పెట్టడం వలన విద్యార్ధులు ఇబ్బందులు ఎదుర్కొంటారని, ముఖ్యంగా సరిహద్దు గ్రామాలలో ఉన్న విద్యార్ధులకి సమస్యలు ఎదురవుతాయని పేర్కొన్నారు.ఈ నిర్ణయంపై మరో సారి పునరాలోచించాలని కోరారు.

ఇలా అన్ని రకాలుగా మాతృభాషలో చదువుని ఆపేసి ఇంగ్లీష్ మీడియం పెట్టాలనే జగన్ నిర్ణయానికి వ్యతిరేకత వస్తున్న నేపధ్యంలో అతను ఎలా ముందుకి వెళ్తాడు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube